బిజినెస్

జాగర్‌నాట్ బుక్స్‌తో హార్పర్‌కొలిన్స్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: జాగర్‌నాట్ బుక్స్ పబ్లిషింగ్ హౌస్‌తో హార్పర్‌కొలిన్స్ ఇండియా వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, జాగర్‌నాట్ ప్రచురించిన పుస్తకాల అమ్మకాలు, సరఫరా బాధ్యతలను హార్పర్‌కొలిన్స్ స్వీకరించింది. ఈ మేరకు ఒప్పందం పత్రాలపై సంతకాలు జరిగినట్టు ఈ రెండు పబ్లిషింగ్ సంస్థల ఉన్నతాధికారులు ప్రకటించారు. హార్పర్‌కొలిన్స్‌తో ఒప్పందం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదని, ఆ సంస్థతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని జాగర్‌నాట్ బుక్స్ వ్యవస్థాపకుడు, ప్రచురణకర్త చికీ సర్కార్ వ్యాఖ్యానించారు. కాగా, జాగర్‌నాట్ సంస్థ ప్రచురించే పుస్తకాల అమ్మకం, సరఫరా బాధ్యతలు తమకు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని హార్పర్‌కొలిన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనంత పద్మనాభన్ అన్నారు. ఆ సంస్థతో ఒప్పందం కుదరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.