బిజినెస్

పసిడి ధర మళ్లీ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో లాభనష్టాల ఆట కొనసాగుతున్నది. నష్టాల ఊబి నుంచి బయటపడిన మార్కెట్ శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టగా, శనివారం మళ్లీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు, దేశీయ మదుపరుల నుంచి కూడా సరైన డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర తగ్గింది. అంతకుముందు, గురువారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు, కిలో వెండి ధర 520 రూపాయలు చొప్పున పతనమయ్యాయి. విదేశీ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి. అంతేగాక, దేశీయ నగల వర్తకులు కూడా కొనుగోళ్లకు ముందుకు రాలేదు. ఫలితంగా, ఈవారం చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందనే అనుమానం వ్యక్తమైంది. కానీ, శుక్రవారం ట్రేడింగ్ మొదలైన మరుక్షణం నుంచే లాభాల్లో బాట పట్టిన పసిడి ధర, మార్కెట్ ముగిసే సమయానికి 200 రూపాయలు ఎగబాకింది. 33,270 రూపాయలకు చేరింది. అదే విధంగా వెండి కూడా 120 రూపాయలు లాభపడడంతో, ధర 39,100 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం నాటి లాభాలతో బులియన్ మార్కెట్ కుదుటపడుతుందనే ఆశ చిగురించింది. అయితే, శనివారం మరోసారి నష్టాలు తప్పలేదు. పది గ్రాముల బంగారం రేటు 100 రూపాయలు తగ్గి, 33,170 రూపాయలకు చేరింది. సహజంగా బంగారంతోపాటు పెరిగే లేదా తరిగే వెండి ధర శనివారం అందుకు భిన్నమైన మార్గంలో ముందుకు సాగింది. 800 రూపాయలు పెరిగి, 39,900 రూపాయలకు చేరింది.