బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: భారత మూలధన మార్కెట్లలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఈనెలలో ఇప్పటికే రూ. 2,741 కోట్ల రూపాయలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫారిన్ పోర్టు పోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఫీఐలు) మదుపుచేశారు. సానుకూల పరిస్థితులు నెలకొనడంతో కేవలం తొలి ఐదు రోజుల్లోనే ఈ మొత్తం పెట్టుబడులు రావడం గమనార్హం. ఇటు దేశీయంగానూ అటు అంతర్జాతీయంగానూ నెలకొన్న ఈ సానుకూల పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని విశే్లషకులు భావిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఎఫ్‌ఫీఐలు సుమారు 11,182 కోట్ల రూపాయల మొత్తాన్ని అటు ఈక్విటీ, ఇటు రుణ మార్కెట్లలో మదుపుచేయడం జరిగింది. డిపాజిటరీ గణాంకాల మేరకు ఎఫ్‌పీఐలు ప్రస్తుత మార్చి నెలలో 1 నుంచి 8వ తేదీ వరకు ఈక్విటీల్లో సుమారు రూ.5,621 కోట్లు మదుపు చేశారు. అలాగే సుమారు రూ.2,880 కోట్లు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. ఈక్రమంలో కేపిటల్ మార్కెట్లలో మొత్తం పెట్టుబడులు 2,741 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత 4వ తేదీన మహాశివరాత్రి పర్వదినం కారణంగా స్టాక్ మార్కెట్లు మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల భారత-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల విషయంలో మదుపర్లకు సానుకూల సంకేతాలు వచ్చాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కార్పొరేట్ బాండ్లపై ఫారిన్ పోర్టు పోలియో ఇనె్వస్టర్లు మదుపుచేసే మొత్తంపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం కూడా భారత మార్కెట్లకు సానుకూల పరిణామని అంటున్నారు. కార్పొరేట్ బాండ్లపై ఎఫ్‌పీఐలు గతంలో 20 శాతం మాత్రమే మదుపు చేయడానికి వీలుండేది. ఇప్పుడా పరిమితులేవీ లేవు. రాజకీయ పరమైన ఒత్తిళ్లేవీ లేని పరిస్థితుల్లో ఆర్బీఐ నిర్ణయం మరిన్ని విదేశీ పెట్టుబడులు రావడానికి అవకాశం కల్పించిందని ప్రముఖ విశే్లషకుడు వీకే విజయకుమార్ పేర్కొన్నారు, అలాగే ఫెడరేషన్ వైఖరిలో సైతం మార్పులు రావడం మనదేశ పెట్టుబడులకు ఊతం ఇచ్చేదన్నారు. ఈ పరిస్థితులు దాదాపు ఈ సంవత్సరాతం వరకు ఉండే అవకాశాలు లేకపోలేదన్నారు. కాగా, సరిహద్దు ఉద్రిక్తతలు తొలగడం, రాజకీయపరమైన సానుకూలతలు నెలకొనడం, కార్పొరేట్ బాండ్లపై విదేశీ పెట్టుబడుల పరిమితిని ఆర్‌బీఐ ఎత్తివేయడం కారణాలుగా విశే్లషకుల అంచనా.