బిజినెస్

ఆరు నెలల గరిష్టానికి స్టాక్ మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి. మార్చి 11: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతతోబాటు, సార్వత్రిక ఎన్నికల ముందస్తు అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో సోమవారం సూచీలు ఆరు నెలల గరిష్టానికి చేరుకున్నాయి, విదేశీ పెట్టుబడులు భారీగా రావడంతో సెనె్సక్స్ 383 పాయింట్లు ఎగబాకి మళ్లీ 37,000 మార్కును దాటింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ అత్యధిక లాభాలను సంతరించుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం విడుదలైన క్రమంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మార్కెట్లకు సానుకూలంగా మారిందని వాణిజ్య రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. మదుపర్లు పెద్దయెత్తున వాటాల కొనుగోలు చేయడంతో 30 షేర్ల సెనె్సక్స్ తొలుత మంచి లాభాలతో ఆరంభమై 37,000 మార్కును దాటింది. అదే ఊపును చివరి వరకు కొనసాగించి 382.67 పాయింట్లు లాభపడి 37,054.10 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే ఈ సూచీ 1.04 శాతం అదనంగా లాభపడింది. గత ఏడాది సెప్టెంబర్ 19 తర్వాత సెనె్సక్స్‌కు ఇదే అతిపెద్ద లాభమని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రోజు సెనె్సక్స్ 37,121.22 పాయింట్లకు ఎగబాకింది. గత శుక్రవారం ఈ సూచీ 53.99 పాయింట్ల నష్టంతో 36,671.43 దిగువన నమోదైంది. కాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం గత సెప్టెంబర్ 26న తర్వాత గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఉదయం సానుకూలతల నడుమ 132 పాయింట్లు అదనంగా ఎగబాకి ఆరు నెలల గరిష్ట స్థాయి 11,172,40 చేరుకుని చివరికి 132,65 పాయింట్ల లాభంతో 11,168.05 వద్ద ముగిసింది. విద్యుత్, చమురు, సహజవాయులు, పీఎస్‌యూ, లోహ, బ్యాంకింగ్, ఆటో, కేపిటల్ గూడ్స్, వౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగాలకు చెందిన స్టాక్స్ కౌంటర్లలో రోజంతా అత్యధిక మొత్తాల్లో వాటాల కొనుగోళ్లు జరిగాయి. ప్రధానంగా ఇటీవల భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడటం వల్ల రానున్న ఎన్నికల్లో ఎన్‌డీఏకి విజయావకాశాలున్నాయని మదుపర్లు విశ్వసిస్తున్నారని అందువల్లే దేశ, విదేశీ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని విశే్లషకుల అంచనా. మధ్యాహ్న ట్రేడింగ్‌లో రూపాయి విలువ డాలర్‌తో 21 పైసలు పెరిగి 69.93 రూపాయలకు చేరింది. ఇలావుండగా గత శుక్రవారం విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఎల్‌ఎల్) 1,095.06 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేయగా దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఎల్‌ఎల్) సుమారు 470.7 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. కాగా చైనా మార్కెట్లలో మందగించిన ఆర్థికాభివృద్ధిని మళ్లీ గాడిలో పడేందుకు అవసరమైన విధాన పరమైన మద్దతు మిగిలిన ఆసియా దేశాల నుంచి లభించవచ్చన్న అంచనాలతో ఈ మార్కెట్లుకు సానుకూలతలు రాగా, యూరోపియన్ మార్కెట్లలో ఈ సెషన్ ఆరంభం నుంచే పెద్ద మొత్తాల్లో వాటాల కొనుగోళ్లు జరిగాయి. షాంఘయ్ కాంపోజిట్ సూచీ 1.92 శాతం లాభపడగా, జపాన్‌కు చెందిన నిక్కీ 0.47 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సంగ్ 0.99 శాతం, కొరియాకు చెందిన కోస్పి 0.03 శాతం వంతున లాభపడ్డాయి. అలాగే యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.38 శాతం, ప్యారిస్‌కు చెందిన సీఏసీ-40 0.32 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.77 శాతం వంతున లాభాలను సంతరించుకున్నాయి.