బిజినెస్

మలేషియా ఎయిర్‌లైన్స్ విక్రయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, మార్చి 12: రెండు విమానాల నుంచి నష్టాలను అందుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మలేషియా ఎయిర్‌లైన్స్‌ను ఇక విక్రయించడం లేదా మూసివేయడమే శరణ్యమని సంబంధిత అధికారి ఒకరు మంగళవారం నాడిక్కడ పేర్కొన్నారు. సుమారు 71 సంవత్సరాల నుంచి సాగుతున్న ఈ ఎయిర్‌లైన్స్ 2014 నుంచి అనుకోని అడ్డంకుల పాలైంది. ప్రధానంగా ఎంహెచ్ 370 విమానం గగనతలంలో అదృశ్యమైంది. ఆ విమానంలో 239 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటికీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక మిస్టరీగా మిగిలిపోయింది. అలాగే ఎంహెచ్ 17 విమానాన్ని రష్యాకు చెందిన క్షిపణి యుద్ధపూరిత ఉక్రెయిన్‌లో కూల్చివేయడం వంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడం ఈ వైమానిక సంస్థకు శరాఘాతంగా పరిణమించింది. గతంలో ఈ సంస్థ మోసాలు, కుంభకోణాలతో సతమతమవగా రాజకుటుంబం జోక్యం చేసుకుని తన సంపద ఖజానాను ఖర్చుచేస్తూ అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా సంవత్సరాలుగా విజయవంతంగా నడుపడం జరుగుతోంది. ప్రత్యేకించి వేలాది మంది ఉద్యోగుల సంఖ్యను సైతం తగ్గించివేయడం జరిగింది. అయితే ఈ విమానయాన సంస్థ పనితీరు సక్రమంగా లేకపోవడంతోబాటు అనుకోని ఎదుదెబ్బలతో నష్టాలు తప్పడం లేదని గత వారం రాజ ఖజానా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఎయిర్‌లైన్స్ భవితవ్యంపై మంగళవారం విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆ దేశ ప్రధాని మహతిర్ మహమ్మద్ సమాధానమిస్తూ ‘ఇది ప్రస్తుతం ఒక తీవ్రమైన విషయంగా మారింద‘ని వ్యాఖ్యానించారు. దీన్ని మూసివేయాలా? లేక విక్రయించాలా? అన్న అంశంపై అధ్యయనం, దర్యాప్తు సాగిస్తున్నామ’న్నారు. కాగా ఈ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఖజానా గత ఏడాది 6.3 బిలియన్ రింగిట్స్ (1.54 బిలియన్ డాలర్లు) పన్ను నష్టాలను ఎదుర్కోవాల్సివచ్చిందని న్యూస్ ఏజెన్సీ బెమామా పేర్కొంది.