బిజినెస్

సూచీల దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతోబాటు విదేశీ నిధులు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం దూకుడును ప్రదర్శించాయి. ఫైనాన్షియల్, విద్యుత్, టెలికాం వాటాల కొనుగోళ్లు జోరందుకుని అగ్రభాగాన నిలిచాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 481.56 పాయింట్లు ఎగబాకి 1.30 శాతం లాభపడింది. తన అత్యధిక మార్కు 37,535.66ను అందుకుంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 133.15 పాయింట్లు ఆధిక్యతతో 1.19 శాతం లాభపడి తన అతిపెద్ద 11,300 మార్కును తిరిగి దాటింది. 11,310.20 వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో భారతీ ఎయిర్‌టెల్ 4.61 శాతంతో అత్యధిక లాభాలను సంతరించుకుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, సన్‌పార్మా, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ డ్యుయో, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం దాదాపు 3.69 శాతం లాభాలను అందుకున్నాయి. ఇలావుండగా బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, ఎన్‌పీటీసీ, కోల్ ఇండియా, ఎస్‌బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, హీరోమోటోకార్ప్, టీసీఎస్‌లు నష్టపోయాయి. ఈ సంస్థలు దాదాపు 1.13 శాతం నష్టపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక రంగాల వారీగా తీసుకుంటే బీఎస్‌ఈ రియాలిటీ సూచీ 2.60 శాతం అధిక లాభాలతో చార్ట్‌లో అగ్రభాగాన నిలిచింది. అలాగే టెలికాం, బ్యాంకెక్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ సూచీలు సైతం లాభాలను నమోదు చేశాయి. కాగా ‘గత రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా బలంపుంజుకుని సాగుతున్నాయి. ఇందుకు రాజకీయ పరమైన ఉద్రిక్తతలు తగ్గిపోవడంతోబాటు, దేశ, విదేశీ మార్కెట్ల సక్రమ పనితీరు దోహదం చేసింద’ని ప్రముఖ విశే్లషకుడు దేవాంగ్ మెహతా అభిప్రాయపడ్డారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్ల పెట్టుబడుల వెల్లువ ఆరంభమైనట్టేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ర్యాలీగా దీన్ని భావిస్తున్నామన్నారు.
విదేశీ పెట్టుబడుల వెల్లువ
విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఎల్‌ఎల్) సోమవారం 3,810.60 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారని బీఎస్‌ఈ ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక అంతర్జాతీయంగా అన్ని దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రధానంగా మన దేశంలో తక్కువ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాల వల్ల రాబడి గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈక్విటీల్లోకి విదేశీ నిధులు సంతృప్తికరమైన స్థితిలో వచ్చే వీలుందంటున్నారు. కాగా ఆసియా ఖండంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన సూచీ హ్యాంగ్‌సెంగ్ 1.46 అధిక లాభాలను అందుకుంది. షాంఘయ్ కాంపోజిట్ సూచీ 1.10 శాతం, కొరియాకు చెందిన కోస్పి 0.89 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.79 శాతం లాభపడ్డాయి. అలాగే యూరోపియన్ జోన్‌లో ప్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.28 శాతం, ప్యారిస్‌కు చెందిన సీఏడీ-40 0.28 శాతం లాభపడగా, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ మాత్రం 0.32 శాతం నష్టపోయింది.
పెరిగిన చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్యారెల్‌పై 0.98 శాతం పెరిగి 67.23 డాలర్లకు చేరింది. ఇక భారత రూపాయి మారకం విలువ సైతం మంగళవారం అమెరికన్ డాలర్‌తో 35 పైసలు పెరిగి ఇంట్రాడేలో 69.54 రూపాయలకు చేరుకుంది.