బిజినెస్

జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతోనే కోడ్ అమల్లోకి రావడంతో, వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతరత్రా విభాగాల పనులు దాదాపుగా స్తంభించిపోయాయి. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం మినహా, కొత్తగా ఎలాంటి తీర్మానాలు చేయడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో, ఈనెల 19న జరగాల్సిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తింది. కొన్ని రోజులుగా అందరినీ వేధిస్తున్న ఈ సస్పెన్స్‌కు ఈసీ బుధవారం తెరదించింది. రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గించిన జీఎస్‌టీ రేటును అమలు పరచడం వంటి పలు కీలక అంశాలు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వస్తాయి. ఎజెండా ఇంతకు ముందే ఖరారు కావడంతో, పన్ను రేటును తగిస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని అమలు పరుస్తూ నిర్ణయం తీసుకోవచ్చా? అలాంటి ప్రతిపాదనను ఆమోదించవచ్చా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే, సమావేశాన్ని నిర్వహించడానికిగానీ, ఇది వరకే ఖరారైన ఎజెండాపై చర్చించడానికిగానీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. ఎలాంటి అనుమానాలు లేకుండా జీఎస్‌టీ కౌన్సిల్ 34వ సమావేశం, అనుకున్న విధంగానే నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. దీనితో, ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా తగ్గించిన జీఎస్‌టీ రేట్లు త్వరలోనే అమల్లోకి వస్తాయి.