బిజినెస్

నిరర్థక ఆస్తులు విక్రయించనున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 14: ప్రాధాన్యత లేని ఆస్తుల విక్రయం ద్వారా సుమారు 400 నుంచి 500 కోట్ల రూ పాయలు సమీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈనెలాఖరులోగా ఇం దుకు సంబంధించిన తొలి విడత ప్రక్రి య పూర్తి చేసేందుకు కసరత్తు చే స్తోంది. ప్రత్యేకించి స్టార్ యూనియన్ డైచీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌డీసీఐ ఫైనా న్స్, సిడ్‌బీలలో ఉన్న వాటాలను విక్రయించాలని ఈ బ్యాంకు నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దీనబంధు మహాపాత్ర గురువారం నాడిక్కడ వెల్లడించారు. ఇందుకు సంబంధించి సమగ్ర ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌‘ (ఆర్‌ఎఫ్‌పీ)ని రూ పొందించడం జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఇదివరకు వచ్చిన ఆఫర్లన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు. ఒక లావాదేవీ ఈనెలాఖరుకల్లా పూర్తవుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపా రు. సుమారు రూ.400 నుంచి 500 కోట్లు ఈ ప్రక్రియ ద్వారా సమకూరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఐతే ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా విక్రయించనున్న ఆస్తి ఏమిటనేది ఆ యన తెలియజేయలేదు. ఈ బ్యాంకు డైచీ లైఫ్ ఇన్సూరెన్స్‌లోని మొత్తం 28.96 శాతం వాటాలను విక్రయించ డం ద్వారా సుమారు రూ.1000 నుంచి 1,200 కోట్లు సమీకరించేందు కు బీఓఐ కృషి చేస్తోందని గతంలో పీ టీఐ వార్తా కథనం రాయడం జరిగింది. అలాగే ఈ బ్యాంకుకు ఎస్‌టీసీఐలో 29.96 శాతం వాటాలున్నాయి. ఇక సిడ్‌బీలో 2.84 శాతం వాటాలున్నాయి. కా గా అప్పుల్లో కూరుకుపోయిన ఎస్సార్ స్టీల్స్ నుంచి 1,800 కోట్ల రూపాయలు వెనక్కు తీసుకోవాలని తమ బ్యాంకు భావిస్తోందని మహాపాత్ర ఈ సందర్భంగా వివరించారు.