బిజినెస్

మహిళలను ఆకట్టుకుంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? వివిధ మాధ్యమాల్లో ప్రకటనలను ఆకట్టుకునే విధంగా ఎలా సిద్ధం చేసుకోవాలి? ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? సహజంగా అటు ఉత్పత్తిదారులను, ఇటు హోల్‌సేలర్లు, రీటైలర్లను వేధించే ప్రశ్నకు ఒకటే సమాధానం లభిస్తున్నది. మహిళలను ఆకట్టుకుంటేనే ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుందనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ బలంగా నాటుకుంది. అందుకే, వ్యాపార, వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువ శాతం మహిళలను ఆకట్టుకునే విధంగానే రూపొందుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం 58 శాతం మహిళా కస్టమర్లను పెంచుకోవడానికి ఉద్దేశించినవికాగా, 35 శాతం అటు మహిళలు, ఇటు పురుషులను ఆకట్టుకోవడానికి తయారు చేసినవి. ఇది కేవలం మన దేశానికి పరిమితమైన అంశం మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ప్రకటనల్లో ఇదే ధోరణిని కనిపిస్తున్నది. ఉత్పత్తిదారుడు, వినియోగదారుల మధ్య వారధిగా ప్రకటనలు ఉపయోగపడతాయి. ఈ ప్రకటనలు ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరిని ఆకట్టుకోవడానికి రూపొందించినవి అనే విషయంపైనే, ఆయా ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుంది. నిజానికి మన దేశంలో ప్రసారమవుతున్న ప్రకటనల్లో అత్యధిక శాతం మహిళల కోసమే అన్నట్టుగా ఉంటాయి. ఒక అంచనా ప్రకారం, మహిళల్లో 75 శాతం మంది వాణిజ్య ప్రకటనలను చూసి, ఆయా వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఒకే రకమైన ప్రకటనలను ఎవరూ ఆదరించడం లేదన్న వాస్తవం అందరికీ తెలిసిందే. అందుకే, ప్రకటనదారులు కొత్తకొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎప్పటికప్పుడు తమతమ ప్రకటనలను అందంగా, అందరినీ ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ప్రకటనల సారాంశం, వాటి టేకింగ్ తీరు, ఇతరత్రా అంశాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కానీ, మహిళలను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమన్న మూల సూత్రం ఏమాత్రం మారలేదు.