బిజినెస్

దూకుడు కొనసాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూలంగా ఉండడంతో, అదే తరహా వ్యాపార లావాదేవీలను రాబోయే వారంలో కూడా ఊహించుకోవచ్చు. బీఎస్‌ఈలో 50 ఇండెక్స్ 3.7 శాతం బలపడగా, నిఫ్టీ 3.5 శాతం పెరిగింది. బీఎస్‌ఈలోని టాప్ పదింటిలో ఎనిమిది కంపెనీలు లాభాలను ఆర్జించాయి. ఈ కంపెనీల వాటాల ధరలు పెరగడంతో, వాటి విలువ 1,42,643.20 కోట్ల రూపాయలు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెరిసిపోయాయి. సోమవారం నుంచి మొదలయ్యే తాజా వారంలోనూ ఇలాంటి పెరుగుదలే నమోదయ్యే అవకాశాలున్నాయని నిపుణుల అభిప్రాయం. మార్కెట్ ర్యాలీ కొనసాగిన విధానం రాబోయే ట్రేడింగ్‌కు సూచికలుగా వారు పేర్కొంటున్నారు. స్థూలంగా చూస్తే, వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ముంబయి, మార్చి 17: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కొత్త వారంలోనూ దూకుడు కొనసాగుతుందా? లేక మళ్లీ అనిశ్చిత పరిస్థితులు నెలకొంటాయా? అనే ప్రశ్నకు అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు సమాధానం కోసం వెతుకుతున్నారు. అయితే, గత వారం ఆర్జించిన లాభాలను బట్టి చూస్తే, ఈవారం కూడా స్టాక్ మార్కెట్ ఆశాజనకంగానే కొనసాగుతుందని విశే్లషకుల అభిప్రాయం. గత వారంలో ట్రేడింగ్ జరిగిన ఐదు రోజులూ సెనె్సక్స్ పెరుగుతునే వచ్చింది. స్టాక్ మా ర్కెట్ లాభాలను పోగేసుకుంది. అమ్మకాల ఒత్తిడి తగ్గి, కొనుగోళ్లు పెరిగాయి. వారం మొత్తం మీద గత వారం సెనె్సక్స్ 1,352.89 పాయింట్లు, నిఫ్టీ 391.45 పాయింట్లు చొప్పున పెరిగాయి. గురువారం స్వల్ప లాభంతో సరిపుచ్చుకోవడాన్ని మినహాయిస్తే, గత వారం స్టాక్ మార్కెట్ లాభాల పం ట పండించింది. ఈ ఒరవడిని చూస్తే, వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే కొనసాగుతుందనే అభిప్రాయం బలపడుతున్నదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏవైనా అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటే తప్ప, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులు స్థిరంగా ఉంటాయని అనుకోవచ్చు. ముడి చమురు ధరలోగానీ, రూపాయి మారకపు విలువ బలపడే విషయంలోగానీ చెప్పుకోదగ్గ మార్పులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, దేశ రాజకీయాల్లో అసాధారణ మార్పులు సంభవిస్తాయని ఊహించడానికి వీల్లే దు. అన్నింటినీ మించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉ న్నందున, కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయా లు తీసుకునే లేదా ప్రకటించే వీల్లేదు. ఈ అంశాలను పరిశీలిస్తే, వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో అ నూహ్య పరిణామాలకు చోటు ఉండదని స్పష్టమవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ అంశాలు కూ డా సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యం లో, స్టాక్ మార్కెట్ కొత్త వారంలోనూ లాభాలను ఆర్జించే అవకాశాలున్నాయి. అయితే, స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కా బట్టి, ముందుగానే అంచనాలు వేయడం తగదన్నది నిజం.
ఈవారం మొత్తంలో వివిధ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ను గమనిస్తే, అన్నిటి కంటే హెచ్‌డీఎఫ్‌సీ లాభపడింది. వారంలో లావాదేవీలు జరిగిన ఐదు రోజుల్లోనూ ఈ సంస్థ షేర్లు లాభాల బాటలోనే నడిచాయి. అత్యధికంగా రూ.1,992.90, అత్యల్పంగా రూ.1,913.75గా నమోవదైన హెచ్‌డీఎఫ్‌సీ షేర్ వాల్యూ 1,957.85 రూపాయల వద్ద ముగిసింది. ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఇండస్‌ఇండ్ బ్యాంక్, వేదాంత, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్, మారుతీ సుజికీ, కోటక్ మహీంద్ర కంపెనీలకు చెందిన షేర్లు గతం వారం జరిగిన ఐదు రోజుల ట్రేడింగ్‌లో నా లుగు రోజులు లాభాల బాటలోనే నడిచాయి. ఒక రోజు మాత్రమే ఈ షేర్ల ధర పతనమైంది. కాగా, టీసీఎస్ వరుసగా నాలుగు రోజుల నష్టాలను ఎదుర్కొని, ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం మాత్రమే లాభాల బాట పట్టింది. గత వారం మొత్తం 21,98,63,734 షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. 3,171.19 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. 18,90,93,880 ఆర్డర్లు ప్లేస్‌కాగా, 13,37,798 ట్రేడ్స్ పూర్తయ్యాయి.