బిజినెస్

రెస్ట్రాంట్స్ విస్తరణపై ‘ఎల్లో టై’ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: హాస్పిటాలిటీ రంగంలో దూసుకెళుతున్న ఎల్లో టై కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో పడింది. రెస్ట్రాంట్స్ విస్తరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇప్పటికే దేశంలోని 15 ప్రధాన నగరాల్లో 50 అవుట్‌లెట్స్‌ను ఎల్లో టై సమర్థంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా మరో 60 అవుట్‌లెట్స్‌ను తెరవాలన్నది ఎల్లో టై ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో రెస్ట్రాంట్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంద ని, మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని ఎల్లో టై వ్యా ఖ్యానిస్తున్నది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో, 12 బ్రాండ్స్ మార్కెట్‌లో స త్తా చాటుతున్నాయి. వీటిలో జెన్యూ న్ బ్రాస్టర్ చికెన్, ధదూమ్, ఉమ్రాన్ రీజినల్, బిల్‌బోర్డ్, రాప్‌చిక్, టెడ్డీస్, వాక్ దిస్ వే, జస్ట్ ఫుఫెల్, చచాగో, ట్విస్ట్ ఆఫ్ తడ్కా, బీబీ జాన్, బాంబే బ్లూ ఉన్నాయి. ఇందులో బాంబే బ్లూను ఇటీవలే ఎవర్‌స్టోక్ కేపిటల్ నుంచి కొనుగోలు చేసింది. మరికొన్ని బ్రాండ్లను తన గ్రూప్‌లోకి తీసుకోవడంతోపాటు, అవుట్‌లెట్స్ సంఖ్యను గణనీయంగా పెంచి, మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది.