బిజినెస్

వాణిజ్య సంస్థల ప్రతినిధులతో 26న ఆర్బీఐ గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: వివిధ వాణిజ్య సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈనెల 26న సమావేశం కానున్నారు. ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు, వడ్డీ రేటుపైన కూడా ఆయన చర్చిస్తారు. ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ/ ఎంసీపీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి ఏప్రిల్ 4న సమావేశం కానుంది. వివిధ అంశాలపై స్పష్టత కోసం, అంతకంటే ముందుగానే వాణిజ్య సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ భేటీ అవుతారు. కాగా, దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నిలు ఏప్రిల్ 11న మొదలవుతాయి. ఫలితంగా 4వ తేదీ నాటి ఎంసీపీ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సమావేశంలో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను నిర్దేశిస్తాయనడంలో అనుమానం లేదు. అన్ని రకాలుగా కీలకంగా మారిన ఎంపీసీ సమావేశానికంటే ముందుగానే ఆర్బీఐ గవర్నర్ వివిధ వాణిజ్య సంస్థలతోపాటు పారిశ్రామిక చాంబర్స్, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలను తీసుకుంటారు. గత ఏడాది డిసెంబర్ 25న ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడం, వృద్ధిరేటు తగ్గకుం డా చూడడం తన ప్రధాన లక్ష్యాలని ప్రకటించారు. ఆ దిశగానే ఆయన చురుగ్గా అడుగులు వేస్తున్నారు. వృద్ధి రేటు తగ్గకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు అత్యంత కీలకం కాబట్టి, ఎంపీసీ సమావేశంలో, ఈ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.