బిజినెస్

కొనసాగుతున్న మాల్యా కంపెనీల దివాలా ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని, వాటిని చెల్లించకుండా ఇంగ్లాండ్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యకు చెందిన కంపెనీల దివాలా ప్రక్రియ జోరందుకుంది. ఇదివరకే కొన్ని ఆస్తులను ఈడీ జప్తు చేయగా, తాజాగా, యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్‌ఎల్)కు యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ (యూబీహెచ్‌ఎల్) నుంచి 2.80 శాతం వాటాలను బదిలీ చేసినట్టు రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ప్రకటించింది. బ్యాంకులను నిలువునా ముంచేసిన మాల్యను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు దివాలా ప్రక్రియ పనులు కొనసాగుతున్నాయి. రికవరీ అధికారితో పాటు బెంగళూరులోని డీఆర్‌టీ-2 యూబీఎల్‌కు చెందిన 74,04,832 వాటాలను యూబీహెచ్‌ఎల్‌కు బదిలీ చేసినట్టు సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. ఈ షేర్ల విలువ సుమారు రూ.1,025 కోట్లు. కొంతకాలంగా యూబీహెచ్‌ఎల్‌లో దివాలా ప్ర క్రియ కొనసాగుతున్నది. మాల్యకు చెందిన వివిధ కంపెనీలు, ఇతరత్రా ఆస్తుల నుంచి రికవరీ చేసిన మొత్తాలను యూబీహెచ్‌ఎల్ ఖాతాలో వేస్తారు. ఆతర్వాత, వ చ్చిన మొత్తం, చెల్లించాల్సిన రుణాలను లెక్క చూ సుకొని, దామాషా ప్రకారం పంపకాలు చేస్తారు.