బిజినెస్

లాభాలతో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 18: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుసగా ఆరో రోజు కూడా సానుకూల ధోరణుల్లో కొనసాగింది. ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం 70.75 పాయింట్లు (0.19 శాతం) పెరిగిన సెనె్సక్స్ 38,095.07 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 35.35 పాయింట్లు (0.31 శాతం) పెరిగి, 11,462.20 పాయింట్లకు చేరింది. ట్రేడింగ్ మొదలైన వెంటనే కొంత సేపు లాభాల్లో పరుగులు తీసిన సెనె్సక్స్ ఆతర్వాత కొంత సేపు పతమైంది. ఒకానొక దశలో, అత్యధికంగా 38,369.59 పాయింట్లకు, అత్యల్పంగా 37,952.10 పాయింట్లుగా నమోదైన సెనె్సక్స్ చివరికి 38 వేల కంటే అధిక పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ అత్యధికంగా 11,530.15 పాయింట్లు, అత్యల్పంగా 11,412.50 పాయింట్లుకాగా, చివరికి రెంటికీ మధ్యమార్గంగా ముగిసింది. పెట్టుబడిదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నకారణంగా సెనె్సక్స్ లాభాల బాట పట్టింది. గత నెల ఎగుమతులు 2.44 శాతం పెరగడం, దిగుమతులు, ప్రత్యేకించి, బంగారం దిగుమతి తగ్గడం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతుల విలువ 26.03 బిలియన్ డాలర్లుకాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 26.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 4,323.49 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. బీఎస్‌ఈలో సోమవారం బజాజ్ ఫైనాన్స్ వాటాలు 2.84 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. పవర్ గ్రిడ్ (2.29 శాతం), యాక్సిస్ బ్యాంక్ (2.21 శాతం), రిలయన్స్ (1.89 శాతం), టాటా స్టీల్ (1.77 శాతం) షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి. మారుతీ సుజికీ (2.56 శాతం), హీరో మోటార్ (2.47 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (2.08 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (1.51 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (1.34 శాతం) కంపెనీలకు చెందిన స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్లు అత్యధికంగా 3.65 శాతం లాభాలను ఆర్జించాయి. హెచ్‌పీసీఎల్ (3.45 శాతం), బజాజ్ ఫైనాన్స్ (2.77 శాతం), రిలయన్స్ (2.64 శాతం), యాక్సిస్ బ్యాంక్ (2.63 శాతం) లాభాలు సంపాదించాయి. నష్టపోయిన కంపెనీల జాబితాలో మారుతీ సుజికీ (2.57 శాతం), హీరో మోటార్ (2.37 శాతం), విప్రో (2.33 శాతం), భారతీ ఎయిర్‌టటెల్ (2.32 శాతం), ఇచర్ (1.45 శాతం) ఉన్నాయి.