బిజినెస్

ఐటీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్నది. దేశంలోనేగాక, ప్రపంచ దేశాల్లోనూ ఐటీ పరిశ్రమ వృద్ధి చెందుతునే ఉంది. అంతర్జాతీయ ఐటీ మార్కెట్‌లో భారతీయులే కీలక పాత్ర పోషిస్తున్నారన్నది వాస్తవం. ఈనెలతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉంది. తుది నివేదికలో ఇది ఎంత మేర నమోదైందో తెలుస్తుంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రంగం కనీసం 9 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఇటీవల విడుదలైన ఒక అధ్యయన నివేదిక స్పష్టం చేస్తున్నది. అయితే, ఐటీ రంగంలో నిరంతరం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ రంగంలో ఉద్యోగాలు చేసేవారు మరింతగా కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండడంతోపాటు, నైపుణ్యం, దక్షత, అంకిత భావం వంటి లక్షణాలు ఉన్నవారినే ఐటీ పరిశ్రమ గుర్తిస్తుంది. ఆదరిస్తుంది. ఇలావుంటే, ఇటీవల కాలంలో డిజిటల్ దాదాపు అన్ని పరిశ్రమలు, వ్యాపార రంగాలు డిజిటల్ సొల్యూషన్స్‌పై ఆధారపడుతున్నాయి. చివరికి మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల్లోనూ ఐటీ సేవల ఆవస్యకత పెరిగింది. ఐటీ సహకారం లేకుండా వ్యాపార, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి అసాధ్యమన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. దీనికి తోడు కేంద్రం అమలు చేస్తున్న కాగితం రహిత (పేపర్ లెస్) లావాదేవీల ప్రభావం అన్నిరకాల వ్యాపార, వాణిజ్య రంగాలపై పడింది. ఫలితంగా కొత్తకొత్త యాప్‌లు, ఇతరత్రా సౌకర్యాలను వినియోగదారులు, ఖాతాదారులకు వ్యాపార సంస్థలు, కంపెనీలు అందిస్తున్నాయి. డిజిటల్ విప్లవం కొనసాగుతున్న తరుణంలో, ఇప్పట్లో ఐటీ సేవలకు డిమాండ్ తగ్గే ప్రసక్తే లేదు. వేగంగా విస్తరిస్తున్న ఈ ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధిరేటును సాధించడం అసాధ్యమేమీ కాదన్న వాదన సత్యదూరం కాదు. చాలా వరకు బ్యాంకింగ్ సేవలు గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఇంటి నుంచే పొందే అవకాశం లభిస్తున్నది. ఒకరు డబ్బును ట్రాన్ఫర్ చేస్తే, అదే మొత్తం మరొకరి ఖాతాలో జమ అవుతుంది. అంటే, ఏక కాలంలో రెండు పనులు పూర్తవుతున్నాయి. అదే విధంగా రుణాలు ఇతరత్రా సేవల కోసం ధ్రువీకరణ పత్రాలను కూడా ఆన్‌లైన్‌లోనే పంపించే వీలుంది. డిజిటల్ విప్ల వం కారణంగా అందుబాటులోకి వచ్చిన ఎన్నో రకాలైన సేవలు, అత్యంత విలువైన కాలం వృథా కాకుండా చేస్తున్నాయి. హాస్పిటల్స్ నుంచి హాస్పిటాలిటీ వరకు, బ్యాంకింగ్ నుంచి బారోయింగ్స్ వరకూ సమస్త సేవలు డిజిటల్ రూపంలోకి రావడంతో, ఐటీ ప్రధాన్యత మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే, ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధిస్తుందని నిపుణులు ధీమాతో ఉన్నారు. వివిధ అధ్యయనాలు, గణాంకాలు, నివేదికలు కూడా ఈ విషయానే్న స్పష్టం చేస్తున్నాయి.