బిజినెస్

రూ.250 కోట్ల సేకరణ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: బాసెల్ 3 నియమాలకు అనుగుణంగా బాండ్ల ను జారీ చేయడం ద్వారా రూ. 250 కోట్ల నిధులు సేకరించనున్నట్టు సౌత్ ఇండియన్ బ్యాంక్ బుధవారం తెలిపింది. బ్యాంకు బోర్డులోని క్యాపిటల్ ప్లానింగ్, ఇన్‌ఫ్యూజన్ కమిటి దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ‘రూ. 150 కోట్ల వరకు నిధులు సేకరించేందుకు రేటెడ్, అన్‌సెక్యూర్డ్, రిడీమేబుల్, నాన్-కన్వర్టిబుల్, బాసెల్ 3నియమాలకు అనుగణమయిన, లోయర్ టయర్ 2బాండ్లను జారీ చేయడానికి ఇన్ఫర్మేషన్ మెమోరాండంను కమిటీ ఆమోదించింది. ఓవర్ సబ్‌స్క్రిప్షన్ వస్తే రూ. వంద కోట్ల వరకు నిలిపి ఉంచుకునేందుకు అనుమతించింది. అంటే మొత్తం రూ. 250 కోట్ల వరకు నిధులు సేకరించేందుకు అనుమతి లభించింది’ అని సౌత్ ఇండియన్ బ్యాంక్ నియంత్రణ సంస్థకు సమర్పించిన ఒక పత్రంలో వివరించింది. ఒక్కో బాండ్ ముఖ విలువ రూ. ఒక లక్ష ఉంటుందని వెల్లడించింది. ఈ బ్యాంకు షేర్ ధర బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో 0.19 శాతం తగ్గి, రూ. 16 వద్ద ముగిసింది.