బిజినెస్

లాభాల్లోనే స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో వరుసగా ఎనిమిదో రోజు కూడా ట్రేండింగ్ లాభాల్లో ముగిసింది. 23.28 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 38,386.75 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 11.35 శాతం పెరగడంతో, 11.521.05 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఏడు రోజులు లాభాలను ఆర్జించిన సెనె్సక్స్ బుధవారం ఆశాజనకంగా మొదలై, ఒకానొక దశలో అత్యధికంగా 38,500 పాయింట్లకు చేరింది. కానీ, అక్కడ నిలకడ కోల్పోవడంతో, కొంత పతనం తప్పలేదు.
అయితే, అత్యల్పంగా 38,316.21 పాయింట్లకు పడినప్పటికీ, అంత తక్కువతో సెనె్సక్స్ ముగియకపోవడం గమనార్హం. ఇన్ఫోసిస్ (2.36 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.39 శాతం), ఎస్ బ్యాంక్ (1.27 శాతం), ఎల్ అండ్ టీ (1.19 శాతం), సన్ ఫార్మా (1.07) వాటాలు లాభాలను ఆర్జించగా, ఎన్‌టీపీసీ (4.29 శాతం), ఓఎన్‌జీసీ (3.28 శాతం), కోల్ ఇండియా (2.43 శాతం), టాటా స్టీల్ (2.41 శాతం), మారుతీ సుజికీ (2.22 శాతం) నష్టాలను చవిచూశాయి.
అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో లాభపడిన కంపెనీల్లో ఇండియాబుల్స్ (5.09 శాతం), హిందాల్‌కో (2.40 శాతం), ఇన్ఫోసిస్ (1.81 శాతం), డాక్టర్ రెడ్డీస్ (1.81 శాతం), ఎల్ అండ్ టీ (1.70 శాతం) లాభపడగా, నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల్లో హెచ్‌పీసీఎల్ (5.52 శాతం), జీ ఎంటర్‌టైనె్మంట్ (5.10 శాతం), బీపీసీఎల్ (4.98 శాతం), ఎన్‌టీపీసీ (3.67 శాతం), ఓఎన్‌జీసీ (2.87 శాతం) ఉన్నాయి.
నేడు సెలవు
హోలీ పండుగను పురస్కరించుకొని భారత స్టాక్ మార్కెట్‌కు గురువారం సెలవు ప్రకటించారు. దీనితో ఈ వారం చివరి రోజు ట్రేడింగ్ శుక్రవారం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు వారానికి ఐదు రోజులు పని చేస్తాయన్న విషయం తెలిసిందే.