బిజినెస్

కొత్త మార్కెట్లపై రెనైసాన్స్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 21: డైమండ్ జ్యుయలరి ఎగుమతిదారు రెనైసాన్స్ జ్యుయలరి వచ్చే రెండేళ్లలో తన ఆదాయాన్ని రెండింతలు చేసుకొని, రూ. 3,600 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా, రష్యా సహా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెనైసాన్స్ జ్యుయలరి ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా టాప్ బ్రాండ్‌ల డైమండ్ ఆభరణాలను డిజైన్ చేసి, తయారు చేసి విక్రయిస్తోంది. 2018లో 3.3 మిలియన్ పీస్‌ల ఆభరణాలను విక్రయించింది. వీటిలో ఎక్కువ మట్టుకు అమెరికాలోని రిటెయిలర్లకు విక్రయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో డైమండ్ ఆభరణాల విక్రయాల ద్వారా ఈ సంస్థ రూ. 1,825 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.