బిజినెస్

బ్రెగ్జిట్‌పై నిర్ణయం ఇప్పట్లో ఉండదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, మార్చి 21: బ్రెగ్జిట్‌పై ఈ వారంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చునని, దీని నిమిత్తం బ్రస్సెల్స్‌లో తదుపరి వారంలో మరోసారి తప్పక సమావేశం కావాల్సిన అవసరం ఉందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జున్కర్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జున్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం లండన్‌లో నెలకొన్న రాజకీయ డోలాయమాన స్థితి నుంచి బయటపడటానికి సభ్య 27 రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, బ్రెగ్జిట్ విషయంలో బ్రస్సెల్స్‌లో జరిగే సమావేశంలో బ్రిటీష్ ప్రధాని థెరిసా మే కొంత సమయం అడిగే అవకాశం ఉందని, పార్లమెంట్ ద్వారానే ఈ సమస్యకు పరిష్కరించుకుందామని ఆమె ప్రతిపాదించవచ్చునని బీబీసీ వెల్లడించింది. కాగా బ్రెగ్జిట్‌పై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న కొందరు యూరోపియన్ నేతలు 46 సంవత్సరాల పాటు ఈయూలో భాగస్వామిగా ఉండి, ఇప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అందులో నుంచి వైదొలగడం దేశానికి క్షేమకరం కాదని వాదిస్తున్నారు. ఇలావుండగా ఈ అంశంపై ఇప్పటికే గత రెండేళ్లుగా భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని యూరోపియన్ కమిషనర్ అధ్యక్షుడు జున్కర్ అన్నారు. దీనిపై ఈనెల 29లోగా తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం బ్రిటన్‌పై ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై మనం ఇప్పటికే రోడ్డు చివరకు వచ్చేసామని, ఇంకో ప్రత్యామ్నాయం ఎంచుకోవాల్సిందేనని అన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన తీర్మానాన్ని ప్రధాని మే బ్రస్సెల్స్ సమావేశంలో ప్రవేశపెట్టి దానికి సంబంధించిన స్పష్టమైన నిర్ణయ పట్టికను ఆమె ప్రకటించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
చిత్రం.. జీన్-క్లాడే జున్కర్