బిజినెస్

ఎగుమతులపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 21: ఎంఆర్‌ఎఫ్ గ్రూప్ నేతృత్వంలోని బొమ్మల తయారీ సంస్థ ‘ఫన్‌స్కూల్ ఇండియా’ తన రెండో ఫ్యాక్టరీ ఉత్పత్తిని గురువారం నుంచి ఆరంభించింది. ఎగుమతులను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని రాణీపెటలో తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ వద్ద ఈ ప్లాంట్‌ను సుమారు 61వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాగా చెన్నై ఓడరేవు సహా ఇతర వౌలిక సదుపాయాలను అందిపుచ్చుకుని విదేశీ మార్కెట్‌ను విస్తరించడంపై ప్రధాన దృష్టిని నిలుపుతాపని ఆ ఫ్యాక్టరీ సీఈఓ జాన్ బాబీ తెలిపారు. ఈ ప్లాంట్‌లో పరికరాల కోసం 25 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఆటోమేషన్, జీవన శైలిని ప్రతిబింబించే డిజైన్లను రూపొందించడం, అధిక వేడిమికి తట్టుకునే విధంగా తయారు చేయడంపై దృష్టి నిలుపుతున్నామన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ ఉత్పత్తులను గోవా ఓడరేవు నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని, ప్రస్తుతం రాణిపేట నుంచి మూడు గంటల ప్రయాణంలోనే ఉన్న చెన్నై ఓడరేవు నుంచి సైతం ఎగుమతులు చేసే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంలో రోడ్లపై రద్దీ సమస్య సైతం తలెత్తదని తెలిపారు. కాగా ఇక్కడ స్థలం, భవన సదుపాయాల కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, మరో 15 కోట్లు పరికరాలపై ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. మరో రూ.15 కోట్ల రూపాయలు అదనపు పరికరాల కోసం ఖర్చు చేయనున్నామన్నారు. కాగా తొలిసారిగా ఈ కంపెనీ తయారీ యూనిట్‌లో రోబోలను వినియోగిస్తున్నట్టు బాబీ చెప్పారు. దాదాపు 500 మందికి తమ కంపెనీ ద్వారా ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ ద్వారా రూ.40 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి ఈ ఎగుమతులు 60 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని వివరించారు. 2020-21 నాటికి దేశ, విదేశీ వాణిజ్యంలో 50 శాతం వంతున వృద్ధిని సాధించే లక్ష్యం ఉందన్నారు. ఈ పాంట్‌కు సంబంధించిన తొలి కన్‌సైన్‌మెంట్ జూన్‌లో కెనడాలోని కంపెనీలకు పంపడం జరుగుతుందన్నారు. ఆ కంపెనీల ద్వారా అమెరికా, యూరోపియన్ మార్కెట్లకు విస్తరించడం జరుగుతుందని ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మెన్ తెలిపారు.