బిజినెస్

వాటాల బదలాయింపుపై ఏజీ, బజాజ్ ఆటో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: బజాజ్ ఆటోకు చెందిన 48 శాతం వాటాలను కేటీఎం ఏజీ నుంచి కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీలోకి బదలాయించే విషయంపై కసరత్తు మొదలైంది. ఈ మేరకు గురువారం ఇక్కడ బజాజ్ ఆటో, ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పరిశ్రమ ఏజీ నడుమ చర్చలు మొదలయ్యాయి. అంటే ఈ సంస్థపై మెజారిటీ నియంత్రణాధికారాలను కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీ సంస్థ నిలుపుకునే అవకాశాలున్నాయి. ఈ చర్చల ద్వారా అన్ని ప్రతిపాదనలకు సంబంధించి తుదినిర్ణయం జరుగుతుంది. తర్వాత ఈ ఏడాది రెండో త్రైమాసికంలో లావాదేవీలకు సంబంధించిన లక్ష్యాలపై నిర్ణయం జరుగుతుందని గురువారం బజాజ్ ఆటో సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ప్రధాన పరిశ్రమైన ఏజీకి కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీలో 62 శాతం వాటాలున్నాయి. అలాగే లిస్టెడ్ కంపెనీ కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీకి సుమారు 51.4 శాతం వాటాలు కేటీఎం ఏజీలో ఉన్నాయి. ఒకవేళ ప్రధాన కంపెనీ ఏజీ, బజాజ్ ఆటో లావాదేవీల ప్రక్రియ పూర్తి చేసుకోదలుచుకుంటే ఇందుకు సంబంధించిన న్యాయపరమైన, ఆర్థిక పరమైన అవసరాలపై, మూలధన అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ డీల్ పూర్తయితే కంపెనీకి చెందిన పెట్టుబడులు సుమారు 50 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని బజాజ్ ఆటో అంచనావేస్తోంది. అలాగే కేటీఎం ఏజీలో కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీ వాటాలు 51.7 శాతం నుంచి 99.7 శాతానికి పెరుగుతాయని బజాజ్ ఆటో పేర్కొంది.