బిజినెస్

జుబిలియంట్ లైఫ్‌సైనె్సస్‌పై అమెరికన్ రెగ్యులేటరీ చర్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: మైసూర్ నంజన్‌గడ్‌లో గల జుబిలియంట్ లైఫ్ సైనె్సస్ సంస్థకు చెందిన ఔషధ తయారీ పరిశ్రమపై అమెరికాకు చెందిన ఆరోగ్య నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈమేరకు ఆ నియంత్రణ విభాగం తమ సంస్థకు తక్కువ స్థాయి క్లాసిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని శుక్రవారం జుబిలియంట్ లైఫ్ సైనె్సస్ సంస్థ స్వయంగా సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లోప్రకటించడం గమనార్హం. ఇదే జరిగితే తమ సంస్థకు చెందిన పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను ఇకపై యూఎస్‌ఎఫ్‌డీఏ నిలిపివేసే (విత్‌హోల్డ్‌చేసే) అవకాశం ఉందని కూడా ఉందని ఆ సంస్థ పేర్కొంది. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 18 వరకు జుబిలియంట్ జెనరిక్స్ లిమిటెడ్ ఏపీ-1 ఔషధ తయారీ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించింది. ఆ తర్వాత తమ సంస్థను ‘అధికారికంగా చర్యలు తీసుకోగల సంకేతాలున్న’ సంస్థ (ఓఏఐ)గా క్లాసిఫై చేసిందని ఆ కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో సీజీఎంపీ రెగ్యులేటరీ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని, ఆలాగే యూఎస్‌ఎఫ్‌డీఏ తమ సంస్థకు చెందిన అన్ని దరఖాస్తులు, ప్రతిపాదనలను సైతం నిలిపివుంచే అవకాశాలున్నాయని తెలిపింది. ఐతే మైసూర్‌లోని తమ పరిశ్రమకు సంబంధించిన ఆదాయానికి, ఉత్పత్తులకు ఈ పరిణామం ఎంతమాత్రం ఆటకం కలిగించబోవని కంపెనీ అధికారులు స్పష్టం చేశారు. అమెరికా నియంత్రణ సంస్థ ఉత్తర్వులపై తమ కంపెనీ 90 రోజుల్లోగా స్పందించాల్సివుందన్నారు. అలాగే 40 రోజుల్లోగా తమ కంపెనీ క్లాసిఫికేషన్‌ను ఓఏ-1 నుంచి తగ్గించాలని కోరుతూ సదరు అమెరికన్ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతోందని జుబిలియంట్ తెలిపింది. ఈ క్రమంలో జుబిలియంట్ లైఫ్ సైనె్సస్ వాటా విలువ గణనీయంగా పడిపోయింది. బీఎస్‌ఈలో శుక్రవారం ఈ కంపెనీ వాటా ధర 2.35 శాతం తగ్గిపోయి రూ.757గా పలికింది.