బిజినెస్

ఆటోమొబైల్ రంగానికి మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆటో మొబైల్ అమ్మకాలు మందకొడిగా ఉంటాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. బీఎస్-6 ఎమిషన్ మార్గదర్శకాలు వస్తున్నందున రెండవ ఆరు నెలల్లో అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. గత పది నెలల్లో ప్రయాణికుల వాహనాల క్రయ విక్రయాల్లో 4 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల వృద్ధిరేటు 23 శాతం నమోదైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్విచక్రవాహనాల వృద్ధిరేటు నిలకడగా ఉంటుందని జోస్యం చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో వృద్ధిరేటు 8 శాతం ఉంది. ప్యాసింజర్ వాహనాల్లో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. 2020-21 నాటికి బీఎస్-6 మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి.
వినియోగదారుల సెంటిమెంట్లకు అనుగుణంగా వాహనాల మోడల్స్‌ను తయారు చేసే అంశంపై కంపెనీలు దృష్టిని సారించాయి. గ్రామీణ రంగంలో ఆదాయం పెరగడం, మధ్యతరగతి జనాభా పెరగడం తదితర కారణాల వల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరిగింది. బీఎస్- ఆరు మార్గదర్శకాలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో అన్ని రంగాల్లో వాహనాల ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.