బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ చేతికి ఔజాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: సైబర్ భద్రతకు సంబంధించిన సేవారంగంలో పేరు సంపాదించిన ఔజాస్ కంపెనీని జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కొనుగోలుచేసింది. 2008లో స్టాక్ మార్కెట్‌లోకి లిస్టింగైన ఈ కంపెనీని కొనడం ద్వారా ఎన్‌ఎస్‌ఈ మరింత మెరుగైన సేవలను అందించగలుగుతుంది. సైబర్‌సెక్యూరిటీ కంపెనీ కోసం భారీగా నిధులను ఖర్చు చేయడం వల్ల ప్రయోజనాలు పెద్దగా ఉండవంటూ వచ్చిన విమర్శలను, సూచనలను, వాదనలను ఎన్‌ఎస్‌ఈ ఏమాత్రం పట్టంచుకోలేదు. క్యాపిటల్ మార్కెట్‌లో గందరగోళంగా ఉన్న నెట్‌వర్క్ విధానాలను సులభతరం చేయడంతోపాటు, ఖాతాదారుల సమాచాన్ని గోప్యంగా ఉంచడం, ఇతరులు ఎవరూ హ్యాక్ చేయకుండా జాగ్రత్తగా కాపాడడం వంటి సేవలు కూడా ఔజాస్ కొనుగోలుతో సులభమవుతాయని ఎన్‌ఎస్‌ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కాలంలో, ఆర్థికపరమైన సైబర్‌నేరాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి సొంతంగా ఒక సెక్యూరిటీ కంపెనీని కలిగి ఉండడం లాభమే తప్ప నష్టం కాదని వ్యాఖ్యానించింది. ఔజాస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 390 కస్టమర్లు ఉండగా, 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.