బిజినెస్

లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: వరుసగా ఎనిమిది రోజులు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) ఆర్జించిన లాభాలకు తొమ్మిదో రోజైన శుక్రవారం బ్రేక్ పడింది. సెనె్సక్స్ 222.14 పాయింట్లు (0.58 శాతం) కోల్పోయి, 38,164.61 పాయింట్లకు పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ బుల్ రన్ ఆగిపోగా, నిఫ్టీ 64.15 పాయింట్లు (0.54 శాతం) పతనమై, 11,456.90 పాయింట్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపరులతోపాటు, దేశీయ పెట్టుబడిదారులు కూడా ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. గురువారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో, శుక్రవారం ట్రేడింగ్ అద్భుతంగా ఉంటుందని అంతా ఊహించారు. ఎనిమిది రోజుల వరుస లాభాలు కొనసాగుతాయని ఆశించారు. కానీ, ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే ప్రారంభమైన పతనం దాదాపుగా చివరి వరకూ కొనసాగింది. చివరిలో పరిస్థితి మెరుగుపడవచ్చని అనిపించినప్పటికీ, చివరికి నష్టాలు తప్పలేదు. బీఎస్‌ఈలో వివిధ కంపెనీల వాటాల ధర పతనమైంది. టాటా మోటార్స్ షేర్ల ధర అత్యధికంగా, 2.47 శాతం పతనమైంది. రిలయన్స్ (2.44), మారుతీ సుజికీ (1.84 శాతం), ఎస్‌బీఐ (1.76 శాతం), బజాజ్ ఫైనాన్స్ (1.23 శాతం) కంపెనీల షేర్ల ధర కూడా భారీగా తగ్గింది.
అయితే, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఎన్‌టీపీసీ షేర్ల ధర 3.67 శాతం పెరిగింది. ఎల్ అండ్ టీ (1.54 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.08 శాతం), టాటా స్టీల్ (0.90 శాతం), పవర్‌గ్రిడ్ (0.53 శాతం) లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలో జరిగిన ట్రేడింగ్‌ను పరిశీలిస్తే, బీపీసీఎల్ (3.12), భారతీ ఎయిర్‌టెల్ (3.00 శాతం), టాటా మోటార్స్ (2.72 శాతం), హెచ్‌పీసీఎల్ (2.51 శాతం), ఐఓసీ (2.36) షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురై, నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎన్‌టీపీసీ (3.75 శాతం), ఎల్ అండ్ టీ (1.76 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.03 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (0.96 శాతం), ఇన్ఫోసిస్ (0.82 శాతం) కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రూపాయి మారకపు విలువ బలపడి, డాలర్ విలువ 68.53 రూపాయలుగా నమోవదైనప్పటికీ, స్టాక్ మార్కెట్ బలపడలేదు. ఆయిల్ అండ్ గ్యాస్, టెలీకాం, ఆటో, బ్యాంకింగ్ రంగాల సూచీలు 0.75 శాతం నుంచి 1.42 శాతం మధ్య పతనమయ్యాయి. పవర్ ఇండెక్స్ లాభాలను నమోదు చేయగా, మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల ధర పతనం నిరాటంకంగా కొనసాగింది. మిడ్ క్యాప్ షేర్ల ధర 0.59 శాతం, స్మాల్ క్యాప్ షేర్ల ధర 0.44 శాతం చొప్పున పతనమయ్యాయి. మొత్తం మీద ఎనిమిది రోజులు కొనసాగిన బుల్ రన్ ఒక్కసారిగా ఆగిపోగా, శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అమ్మకాల జోరు కొనసాగింది.