బిజినెస్

జనపనార సంచుల దిగుమతిపై యాంటీ-డంపింగ్ డ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: బంగ్లాదేశ్ నుంచి జనపనార సంచుల దిగుమతులపై విధించిన యాంటీ డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. బంగ్లాదేశ్ నుంచి వీటి దిగుమతిని నిరుత్సాహ పరచకుంటే దేశీయంగా జనపనార ఉత్పత్తులతో సంబంధం ఉన్నవారు దెబ్బతింటారు. అందువల్ల వీటి దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. 2017 జనవరి 5వ తేదీనుంచి విధిస్తున్న యాంటీ-డంపింగ్ డ్యూటీని పొడిగించాలని సిఫారసు వచ్చినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖలోని పరిశోధన విభాగమయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. జనపనార ఉత్పత్తులపై ఒక్కో టన్ను దిగుమతిపై 6.3 డాలర్ల నుంచి 351.7 డాలర్ల వరకు సుంకాన్ని విధిస్తున్నారు.