బిజినెస్

అమెరికా మార్కెట్లోకి ‘లుపిన్’ జనరిక్ ఔషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: తమ సంస్థకు చెందిన జనరిక్ లెవోథైరాక్సిన్ సోడియం మాత్రలను అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు ఔషధ తయారీ సంస్థ ‘లుపిన్ లిమిటెడ్’ శుక్రవారం నాడిక్కడ తెలిపింది. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఆమోదం పొందిన అనంతరం ఈ మాత్రల తయారీని చేపట్టడం జరిగిందని లుపిన్ శుక్రవారం సమర్పించిన బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏబీబీవీఐఈ ఐఎన్‌సీకి చెందిన సింథరాయిడ్ జెనరిక్ మాత్రలకు తదుపరి వెర్షన్‌గా ఈ మాత్రలను తయారు చేయడం జరిగిందని కంపెనీ తెలిపింది. హైపోథైరాయిడిజంకు వాడే మాత్రలకు బదులుగా ఇవి వాడవచ్చని, అలాగే శస్త్ర చికిత్సల సమయాల్లో రేడియోఅయోడైన్ థెరపీగా వాడవచ్చని తెలిపింది. థైరాయిడ్ కేన్సర్ రోగులు సైతం ఈ ఔషదం వినియోగించే వీలుందని లుపిన్ తెలిపింది. లెవోథైరాక్సిన్ సోడియం మాత్రలు 25, 50, 75, 88, 100, 112 ఎంజీల్లోనూ 300 ఎంఈజీల్లోనూ లభిస్తాయి. అమెరికన్ మార్కెట్‌లో 2.5 బిలియన్ డాలర్ల మేర భాగస్వామ్యం ఆశిస్తున్నామని కంపెనీ తెలిపింది. కాగా లుపిన్ లిమిటెడ్ వాటాలు శుక్రవారం ఒక్కొక్కటి 749.30 రూపాయల వంతున 0.43 శాతం దిగువన ట్రేడయ్యాయి.