బిజినెస్

వారాంతంలో నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లాభాల్లో మొదలై, వరుసగా మూడు రోజులు ఉత్సాహంగా సాగినప్పటికీ, చివరి రోజున నష్టాలను మూటగట్టుకుంది. వరుసగా ఎనిమిది రోజులు లాభాల్లో సాగిన మార్కెట్ వా రాంతంలో నష్టం ఎదుర్కోవడం మదుపరులనేగాక, స్టాక్ బ్రోకర్లను కూడా ఆందోళనకు గురి చేసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సోమవారం 38,024.32 పాయింట్లతో ప్రారంభమైన సెనె్సక్స్ 38,095.07 పాయింట్ల వద్ద ముగిసింది. మం గళవారం కూడా అదే ఒరవడిని కొనసాగించి, లాభాలను ఆర్జించింది. 38,363.47 పాయింట్లకు చేరింది. బుధవారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, చివరిలో లాభాల్లోనే ముగిసింది. 38,386.75 పాయింట్లుగా నమోదైంది. గురువారం హోలీ కారణంగా మార్కెట్‌కు సెలవుకాగా, ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం అమ్మకాల జోరు పెరిగింది. ఎనిమిది రోజులు పాటు కొనసాగిన బుల్ రన్ ఒక్కసారిగా నిలిచిపోగా, 222.14 పాయింట్లు పతనమైన సెనె్సక్స్ 38,164.61 పాయింట్లకు పడిపోయింది. సెనె్సక్స్ మాదిరిగానే నిఫ్టీ కూడా మొదటి మూడు రోజులు లాభాల్లో నడిచి, చివరి రోజున నష్టాన్ని చవిచూసింది. మొత్తం మీద ఈవారంలో సెనె్సక్స్ 140.29 పాయింట్లు లాభపడింది.