బిజినెస్

వెనెజులా నుంచి ముడిచమురు దిగుమతులు నిలిపివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 23: లాటిన్ అమెరికన్ దేశాల్లో ఒకటైన వెనెజులాపై తమ దేశం విధించిన ఆంక్షలను భారత కంపెనీలు పాటిస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోని ప్రైవేటు కంపెనీలన్నీ ఆ దేశం నుంచి ముడిచమురు దిగుమతులను ఆపివేశాయని అమెరికా పరిపాలనా విభాగానికి చెందిన అధికారి ఒకరు ఇక్కడ స్పష్టం చేశారు. ఇంటా బయటా తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మాడ్యురో మాత్రం పదవిలో కొనసాగేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న క్రమంలో యూఎస్ పాలనా విభాగం అధికారి ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత్‌కు ముడిచమురు ఎగుమతులు చేస్తున్న దేశాల్లో వెనెజులా మూడో అతిపెద్ద దేశం కావడం విశేషం. అమెరికాపై ఉన్న మమకారంతోనే భారతీయ కంపెనీలు ఈ దిగుమతులు ఆపివేశాయని అర్థం అవుతోందని ఆ అధికారి గురువారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. వెనెజులా విషయంలో భారత్ అమెరికాకు అన్ని విధాలుగా సహకరిస్తోందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయం కూడా భారత్- అమెరికా సంప్రదింపుల్లో ఒక అంశంగా ఉందన్నారు. ద్వైపాక్షిక బంధాలకు తామెంతో విలువనిస్తామని, అది వ్యూహాత్మకంగా సాగుతోందని తెలిపారు. గత వారం అమెరికాకు వచ్చిన భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలేతో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వెనెజులా వ్యవహారంపై చర్చలు జరిపారన్నారు. ప్రధానంగా నికొలస్ మాడ్యురో విషయంపై కూడా చర్చించడం జరిగిందన్నారు. ఇలావుండగా వెనెజులా చమురు శాఖ మంత్రి, ప్రభుత్వ నిర్వహణలోని చమురు కంపెనీ పీడీవీఎస్‌ఏ అధ్యక్షుడు మాన్యువల్ క్యుయెవెడో గ్రేటర్ నాడియాలో విలేఖరులతో మాట్లాడుతూ భారత్‌లోని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమ దేశం నుంచి మరింత అధికంగా ముడిచమురు ఎగుమతులు కోరుతోందని పేర్కొన్నారు.