బిజినెస్

భారీగా విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: అంతర్జాతీయంగా ద్రవ్య లబ్ధత మెరుగు పడడంతో, దేశీయ కేపిటల్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చి చేరాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) సుమారు 38,211 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. డెబిట్, ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 11,182 కోట్ల రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య లబ్ధతను సరళీకృతం చేశారు. దీనితో చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు సాధ్యమయ్యాయి. ఈక్విటీస్‌కు వీరు పెట్టిన పెట్టుబడి 27,424.18 కోట్ల రూపాయలు. డెబిట్ మార్కెట్‌లోకి వారి ద్వారా 10,787.02 కోట్ల రూపాయలు వచ్చిచేరాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడక పోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటును పెంచకపోవడం వంటి అంశాలు కూడా విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌లోనే ఉండడం వల్ల, పెట్టుబడులపై ఆశించిన దాని కంటే ఎక్కువగానే లాభాలు వస్తాయన్న అభిప్రాయం ఎఫ్‌పీఐలలో వ్యక్తమవుతున్నది. అందుకే, దేశీయ కేపిటల్ మార్కెట్‌లోకి వారి ద్వారా డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతున్నది. కొంత కాలంగా అంటీముట్టనట్టు వ్యవహరించిన వీరు, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతునే ఉండడంతో, ప్రత్యామ్నాయ మార్కెట్లను అనే్వషించడం మొదలు పెట్టారు. అదే సమయంలో, భారత్‌లో కేపిటల్ మార్కెట్ శరవేగంగా విస్తరించడాన్ని గమనించి, ఇటువైపు దృష్టిని మరల్చారు.