బిజినెస్

శాంషెక్‌కు ‘నాయర్’ నిధులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 24: అమెరికాకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ శాంషెక్‌లో పెట్టుబడులకు నాయర్ వెంచర్స్ అంగీకారం తెలిపింది. ఎంత మొత్తం అనే విషయాన్ని ప్రస్తావించకుండా, శాంషెక్‌తో ఒప్పందం కుదిరిందని నాయర్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూకే, యూఎస్‌తోపాటు భారత్‌లోనూ మార్కెట్‌ను విస్తరించడానికి అవసరమైన మొత్తాలను, వౌలిక సదుపాయాలను శాంషెక్‌కు సమకూరుస్తున్నట్టు నాయర్ తన ప్రకటనలో వివరించింది. మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో పెట్టుబడులు పెట్టడమేగాక, వివిధ రకాలైన ప్రణాళికలను కూడా సమర్థంగా అమలు చేస్తామని తెలిపింది. మూలధన కల్పన, ఈక్విటీ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు ఉంచినట్టు నాయర్ వివరించింది. ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త డిజైన్లతో శాంషెక్ మహిళా వస్త్ర ప్రపంచంలో నూతన శకానికి నాంది పలికింది. డిజిటల్ మార్కెట్‌పైనే దృష్టి కేంద్రీకరించిన ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉంది. ‘రెడీ టు వేర్’ దుస్తులను అమ్మకానికి ఉంచుతున్నది. డిజిటల్ మార్కెట్ అద్భుతంగా ఉందని, యూకే, యూఎస్, భారత్ నుంచి డిమాండ్ పెరుగుతున్నదని శాంషెక్ సహ వ్యవస్థాపకురాలు సమీక్ష బజాజ్ వ్యాఖ్యానించారు. ఆమె పీటీఐతో మాట్లాడుతూ వృద్ధికి, విస్తరణకు డిజిటల్ వస్త్ర రంగం అనువుగా ఉందని పేర్కొంది. నాయర్ వెంచర్స్ నుంచి లభించే మద్దతుతో మార్కెట్‌ను మరింత విస్తృతం చేస్తామని ఆమె వివరించింది.