బిజినెస్

ఈ వారం స్టాక్ మార్కెట్లకు ఒడిదుడుకులు తప్పవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం అస్థిర పరిస్థితుల్లో కొనసాగే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు వేచిచూద్దామన్న మదుపర్ల వైఖరితోపాటు ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుండటం వంటి కారణాలు ఇందుకు దోహదం చేయవచ్చని అంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగిడడంతో రుణ మార్కెట్లకు ద్రవ్య లభ్యత తగ్గవచ్చని అంటున్నారు. ప్రత్యేకించి దేశీయ సంస్ధాగత మదుపర్లు అధిక శాతం వాటాల విక్రయాలకు పాల్పడే అవకాశాలున్నాయని, అందువల్ల మార్కెట్లు కొంతవరకు వత్తిడిని ఎదుర్కోవచ్చని ప్రముఖ విశే్లషకుడు జిమీత్‌మోదీ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు ఏడు విడతలుగా పోలింగ్ ఏప్రిల్ 11 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్న ఊహాగానాలు, ద్రవ్యోల్బణం అదుపు వంటి అంశాల ఆధారంగా ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల మార్గదర్శకత్వంలో నడిచాయి. ఐతే మరోవైపు బ్రెగ్జిట్ డీల్, అమెరికా-చైనా వాణిజ్య చర్చల మందగమనం వంటివి అంతర్జాతీయ మార్కెట్లకు ప్రతిబంధకంగా మారాయని మరో విశే్లషకుడు వినోద్ నాయర్ పేర్కొన్నారు. అలాగే ఇంకోవైపు రూపాయి విలువ, ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల వంటివి వాణిజ్య సెంటిమెంటును ప్రభావితం చేయడం కొనసాగవచ్చని అంచనా. వరుసగా ఎనిమిది రోజులపాటు లాభాల్లో నడిచిన బీఎస్‌ఈ సెనె్సక్స్ ఒక్కసారిగా 222 పాయింట్లు కోల్పోయి శుక్రవారం నాడు డీలాపడిన సంగతి తెలిసిందే. రేటింగ్ ఏజన్సీ భారత వృద్ధిరేటుకు పగ్గాలు పడే అవకాశాలున్నాయని వేసిన అంచనాలు ప్రభావం చూపడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఈ క్రమంలో 30 షేర్ల సూచీ 38,164.61 వద్ద దిగువన, అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 11.456.90 వద్ద ముగిశాయి. కాగా పూర్తిగా గత వారపు ఫలితాలను పరిశీలిస్తే సెనె్సక్స్ అదనంగా 140 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు వంతున లాభపడ్డాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గవచ్చని ఫిచ్ రేటింగ్స్ గడచిన శుక్రవారం అంచనాలు ప్రకటించడం దేశ ఆర్థికాభివృద్ధి ఊహించినదానికంటే తగ్గేలా చేసినట్టు విశే్లషకులు చెబుతున్నారు. అలాగే ఫిచ్ గత డిసెంబర్ అంచనాలను సవరిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి సైతం వృద్ధిరేటును 7.2 నుంచి 6.9కి తగ్గించివేయడం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.