బిజినెస్

ఏసీ సెగ్మెంట్‌లో భారీ వృద్ధి రేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నివాసాల ఏసీ సెగ్మెంట్‌లో భారీ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉన్నట్టు మిత్సుబిషి ఎలక్ట్రానిక్స్ అంచనా వేస్తున్నది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందువల్ల, తమ సంస్థ ఏసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని జపాన్‌కు చెందిన ఈ కంపెనీ భావిస్తున్నది. మెట్రో నగరాలతోపాటు, చిన్నాపెద్దా నగరాల్లో కూడా మార్కెట్‌ను విస్తరింప చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇన్‌వర్టర్ విధానంలో రూపొందించిన ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరుగుతున్నదని మిత్సుబిషి ఒక ప్రకటనలో తెలిపింది. ఎండలు తీక్షణమవుతున్న కొద్దీ ఏసీల అమ్మకాలు ఎక్కువవుతాయని, సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉన్నందువల్ల, తమ ఉత్పత్తుల మార్కెట్ విస్తారంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. రెండంకెల వృద్ధిరేటును అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఎన్ని యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా ఎంచుకున్నదనే విషయాన్ని మిత్సుబిషి ఆ ప్రకటనలో పేర్కోలేదు. 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లోనూ తమ సంస్థ ఏసీలు పని చేస్తాయని, ఉత్తమ సాంకేతిక విలువలతో కూడిన ఉత్పత్తులు కాబట్టే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించింది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి రెండంకెల వృద్ధిరేటును సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఏసీ సెగ్మెంట్‌లో మిత్సుబిషికి సుమారు20 కంపెనీలు గట్టిపోటీనిస్తున్నాయి. సగటున ఏటా పది లక్షల యూనిట్లు అమ్ముడవుతుండగా, వాటిలో మిస్తుబిషి వాటానే ఎక్కువ. అయితే, మిగతా కంపెనీల ఏసీలకు ఉన్న మార్కెట్‌ను కూడా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో మిస్తుబిషి ప్రణాళికలను సిద్ధం చేసుకొని, అమలు పరుస్తున్నది.