బిజినెస్

2020 నాటికి 2 శాతానికి చేరనున్న ఆహార ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 25: రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 2 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని సోమవారం విడుదలైన ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 0.7 శాతం ఉండగా రాబోయే ఏడాది కాలంలోనే 2 శాతానికి చేరవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. ఆహారానికి సంబంధించిన ధరలు తక్కువ స్థాయిలో ఉండటం ఓ కారణమని, ఇందుకు సంబంధించి ఆర్బీఐ రేట్ల నిర్ణయంలో నేర్పుగా వ్యవహరించాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మేన్ సచ్ దీనిపై అధ్యయనం జరిపి నివేదించింది. భారత్‌లో గడచిన కొన్ని నెలల నుంచి ఆహార ధాన్యాలు, కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సరైన థరలు రాకపోవడం వల్ల కూరగాయల ఉత్పత్తుల్లో తరుగుదల ఏర్పడుతోందని వ్యవసాయోత్పత్తులు, మార్కెటింగ్ కమిటీ చట్టం (ఏపీఎంసీ) జాబితా నుంచి సుమారు 14 రాష్ట్రాల్లో కూరగాయలను తొలగించడం జరిగిందని అందువల్ల అక్కడ కొంత మద్దతు ధరకు ఊతం లభించిందని నివేదిక పేర్కొంది. అలాగే ఆహార ధాన్యాల విషయంలో చేపట్టిన మంచి ఆహార నియంత్రణ విధానాలు తోడ్పడ్డాయని తెలిపింది. ప్రభుత్వం పెద్దమొత్తాల్లో భారీ నిల్వలను విడుదల చేయడంతోబాటు విదేశాల నుంచి సైతం ఆహార ధాన్యాలను దిగుమతులు చేసుకోవడం జరిగింది. ఇంత వరకు బాగేనే ఉన్నా రాబోయే రోజుల్లో అనూహ్య వాతావరణ పరిస్థితుల ప్రతికూలతలతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తలెత్తే అవకాశాలున్నాయని నివేదిక హెచ్చరించింది. ఈ ద్రవ్యోల్బణం 2020 నాటికి 1.5నుంచి 2 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. అంటే 2019లో 0.7 శాతం ఉన్న ఈ ద్రవ్యోల్బణం 2 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం రైతులు మద్దతు ధరల కోసం పోరాటాలు సాగిస్తున్నారని, అలాగే పంట దిగుబడుల్లో పెరగుదల కోసం తపిస్తున్నారని ఆ బ్రోకరేజ్ సంస్థ నివేదిక పేర్కొంది. దేశ రాజధానితోబాటు, ఆర్థిక రాజధానిలో సైతం ఈ నిరసన నినాదాలు అధికమయ్యాయని, ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే రూ.6వేల రూపాయలు పంట పెట్టుబడుల సాయంగా అందించేందుకు హామీ ఇచ్చింది.