బిజినెస్

కేంద్ర ఆర్థిక మంత్రితో ఆర్బీఐ గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: రిజర్వు బ్యాంకు గవర్నర్ శశికాంత దాస్ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ ఆర్థిక స్థితిగతులపై చర్చ జరిగినట్టు సమాచారం. ప్రత్యేకించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన తొలి నెలవారీ ద్రవ్య విధానంపై చర్చించినట్టు తెలిసింది. 3ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన సంఘం (మానిటరీ పాలసీ కమిటీ) సమావేశం ఏప్రిల్ 2నుంచి 4 వరకు జరుగనుండగా అందులో తొలి నెలవారీ విధానంపై నిర్ణయం జరుగుతుంది. దీనికంటే ముందు ఆర్బీఐ గవర్నర్ కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించడం రివాజు. అందులో భాగంగానే ఈ భేటీ జరిగింద2ని సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ దాస్ చెప్పారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనున్న క్రమంలో ఈ నెలవారీ విధాన నిర్ణయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. గతంలో 18 నెలల తర్వాత ఆర్బీఐ గత ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రేట్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్బీఐ బెంచ్ మార్కు కంటే రీటెయిల్ ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నందున పరిశ్రమలకు సంబంధించి మరోమారు ధరల కోత విధించాల్సిందిగా ఆ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో రాబోయే ఎంపీసీ సమావేశ నిర్ణయానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఫిబ్రవరిలో రీటెయిన్ ద్రవ్యోల్బణం 2.57 శాతానికి పెరిగినప్పటికీ ఆర్బీఐ బెంచ్‌మార్కు 4 శాతంకన్నా ఇది తక్కువే. ఈ దఫా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది.