బిజినెస్

భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 25: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశాలున్నాయన్న అంచనాలు దేశ, విదేశాల్లోని ఇనె్వస్టర్లలో ఆందోళన రేపాయి. దీంతో సోమవారం పెద్దయెత్తున వాటాల అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా బ్యాంకింగ్, రియాలిటీ కౌంటర్లలో భారీగా వాటాల అమ్మకం చోటుచేసుకోవడంతో సెనె్సక్స్ 38,000 పాయింట్ల మార్కుకు దిగువకు చేరుకుంది. మొత్తం 355.70 పాయింట్లు నష్టపోయిన ఈ సూచీ 37,808.91 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 102.65 పాయింట్లు నష్టపోయి 11,354,25 వద్ద ముగిసింది. గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు మొత్తం రెండు సెషన్లలో సెనె్సక్స్ మొత్తం 575 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. అమెరికా, ఐరోపా దేశాల నుంచి అనూహ్యంగా ఆర్థికాభివృద్ధి గణాంకాలు బలహీన స్థాయిలో నమోదు కావడం మదుపర్ల సెంటుమెంటును ప్రభావితం చేసినట్లు విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే అమెరికా-చైనా వాణిజ్య సంప్రదింపులు సైతం సానుకూలంగా లేవని అంటున్నారు. గత వారం అమెరికా ఫెడరల్ రిజర్వు 10 సంవత్సరాల ఖజానా రాబడి వివరాల గణాంకాలు వెలువరించడంతో అందులో గడచిన యేడాది తక్కువగా నమోదవడం నుంచి మదుపర్లలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. అప్పటి నుంచే ఆసియన్ మార్కెట్లలో సైతం తగ్గుదల నమోదైంది. ఐరోపా దేశాల వాటాలు సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. 30 షేర్ల సెనె్సక్స్ సోమవారం తొలుత 38,016.76 వద్ద దిగువన మొదలై మొత్తం రోజంతా ప్రతికూల వాతావరణంలోనే నడిచి ఏ దశలోనూ కోలుకోలేదు. చివరికి 0.93 శాతం నష్టపోక తప్పలేదు, అలాగే 50 షేర్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,400 నుంచి 11,311,60 పాయింట్లకు పడిపోయి 0.90 శాతం నష్టపోయింది. కాగా దేశీయ సంస్థాగత మదుపర్లు గత శుక్రవారం 657.37 కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించగా, విదేశీ మదుపర్లు 1,374,57 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారని ప్రాథమిక గణాంకాలు తెలుపుతున్నాయి,