బిజినెస్

స్విఫ్ట్ నిబంధనల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్ కొరడా ఝళిపించింది. రూ.2కోట్ల జరిమానా వి ధించింది. ప్రపంచ వ్యాప్త బ్యాంకుల అంతర్గత ఆర్థిక టెలికమ్యూనికేషన్స్ సొసైటీ (స్విఫ్ట్) నిబంధనలను పీఎన్‌బీ అమలు చేయకపోవడాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. పీఎన్‌బీ స్వయంగా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయంగా మెస్సేజింగ్ సాఫ్ట్‌వేర్ కలిగిన స్వి ఫ్ట్2 విధానాన్ని బ్యాంకులు అర్థిక లావాదేవీల సమయంలో వినియోగిస్తాయి. కాగా ప్రముఖ వజ్రాల వ్యాపారి, బిలియనీర్ నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చౌక్సీలు పీఎన్‌బీని 14,000 కోట్ల రూపాయల మేర మోసగించిన కేసులో ఈ స్విఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలో రూ.2కోట్ల జరిమానా విధిస్తున్నట్టు రిజర్వుబ్యాంకు ఈనెల 25న పంపిన లేఖలో పేర్కొన్నట్టు మంగళవారం పీఎన్‌బీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. స్విఫ్ట్‌కు సంబంధించిన ఆపరేషనల్ కంట్రోల్స్‌పై అంచనాలు, పరిశీలనలు జరిపిన సమయంలో నిబంధనల ఉల్లంఘన వెలుగుచూసిందని, ఈ క్రమంలోనే ఆర్బీఐ 20 మిలియన్ల పెనాల్టీ విధించిందని పీఎన్‌బీ స్పష్టం చేసింది. స్విఫ్ట్ నిర్వహణలను మరింత పటిష్టవంతం చేసేందుకు, నిర్దేశిత కాలవ్యవధిలో ఇందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేయని ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల 36 ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులపై సుమారు 71 కోట్ల రూపాయల మేర జరిమానాలు విధించడం జరిగింది. ఇందులో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీబ్యాంక్, కెనరాబ్యాంక్, ఎస్‌బ్యాంక్ ఉన్నాయి.