బిజినెస్

దేశ వృద్ధిరేటు గణాంకాలపై నిష్పక్షపాత అధ్యయనం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: నిష్పక్షపాతమైన అధ్యయన కమిటీని ఏర్పాటుచేసి దేశ వృద్ధిరేటు గణాంకాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిరేటు 7వాతం ఉంటే మరి ఎందుకు అవసరమైనన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడలేదని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ మానిటరీ నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా సైతం పనిచేసిన రఘురాం రాజన్ ప్రస్తుత వృద్ధిరేటుపై నిర్ధారణకు ఏ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారన్నది తనకు అర్థం కావడం లేదని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఓ మంత్రి సైతం తనవద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని సీఎన్‌బీసీ టీవీకి మంగళవారం ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ఆర్థికాభివృద్ధి గణాంకాలను సమర్థించుకుంటున్నారని, ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే ఈ గణాంకాలు సాధించామని ఆయన చెబుతున్నారని, దేశంలో ఎక్కడా ఉద్యోగాలు లేకుండా వృద్ధిరేటు ఏమిటన్న అంశంపై ఆందోళనలు తలెత్తలేదని ఆయన చెబుతున్నారని రాజన్ పేర్కొన్నారు. దేశంలో ఉద్యోగావకాశాలను పెంచేవిధంగా బలమైన వృద్ధిరేటు సాధించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వృద్ధిరేటుపై నెలకొన్న వివాదంపై వ్యాఖ్యారిస్తూ ప్రజల్లో దీనిపై విశ్వసనీయతను పెంచాలంటే ఓ నిష్పక్షపాతమైన కమిటీని ఏర్పాటు చేసి అసలు గణాంకాలను నిగ్గుదేల్చాల్సివుందన్నారు.