బిజినెస్

అంతర్జాతీయ సానుకూలతలతో.. మళ్లీ పుంజుకున్న సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 26: అంతర్జాతీయంగా సానుకూలతలు నెలకొనడంతోబాటు, దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధులు వెల్లువలా రావడంతో మంగళవారం సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. వరుసగా రెండు రోజులు తీవ్ర నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ మళ్లీ లాభాల పరుగు అందుకుని 425 పాయింట్లు లాభపడి 38,000 మార్కును దాటింది. హెవీ వెయిట్స్ రిలయన్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా లాభాలను సంతరించుకున్నాయి. అలాగే నిఫ్టీ సైతం దాదాపుగా 11.500 మార్కుకు చేరుకుంది. రూపాయి బలోపేతం కావడం సైతం స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. డాలర్‌తో రూపాయి విలువ సుమారు 19 పైసల మేర లాభపడి ఇంట్రాడేలో 68.77 రూపాయల వద్ద ట్రేడయింది. ఆసియన్ మార్కెట్లలో కొంతమేర సానుకూలతలు నెలకొనడంతో ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన మద్దతుతో ఆరంభమయ్యాయి. అయితే ఈ సానుకూలత ఆసియాలోని ఒక ప్రాంతానికే పరిమితమైందని, మిగిలిన దేశాల్లో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారించారని విశే్లషకులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం తర్వాత వాటాల కొనుగోళ్లు మరింత ముమ్మరంగా సాగాయి. దీంతో రెండు సూచీల ర్యాలీ జరిగింది. 30 షేర్ల సెనె్సక్స్ ఒక దశలో 38,297.70 వద్దకు చేరుకుంది. ఐతే తర్వాత కొంత దిద్దుబాటుకు గురై చివరిగా 424.50 పాయింట్లు లాభంతో 38,233.41 వద్ద స్థిరపడింది. అంటే రోజుమొత్తం 1.12 శాతం లాభపడింది. ప్రపంచ వ్యాప్తంగా వాటాలు అమ్మకాల వత్తిడిని ఎదుర్కొని గడచిన రెండు రోజులుగా ఈ సూచీ 575 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 129 పాయింట్లు ఎగబాకి 1.14 శాతం లాభాలతో 11,483,25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,495.90-11,352,45 మధ్య ఊగిసలాడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో చమురు, రిలయన్స్ టెలికం, పరిశ్రమలు సంస్థలు అత్యధికంగా 3 శాతం మేర లాభపడ్డాయి. ఇలావుండగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు 150.40 కోట్ల విలువైన వాటాలను సోమవారం కొలుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు 12.52 కోట్ల విలువైన వాటాలను విక్రయించారని ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లు సైతం ఇటీవలి వరుస నష్టాలకు చెక్‌పెట్టి మళ్లీ పుంజుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరంగా ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాల నడుమ బలహీనమైన గణాంకాలు చూపిన అమెరికా ఖజానా ఎట్టకేలకు బలపడటంతో మదుపర్లలో మళ్లీ సానుకూల దృక్పథం నెలకొంది.