బిజినెస్

వేతన బకాయలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 26: పెండింగ్‌లో ఉన్న వేతన బకారుూలు చెల్లించాలని జెట్ ఎయిర్‌వేస్ దేశీయ పైలెట్ల సంఘం జాతీయ వైమానికుల గిల్డ్ (నాగ్) నేతృత్వంలో మంగళవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసింది. ‘నాగ్’ నేతలు ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ను కలిసి చర్చలు జరిపారు. దాదాపు 25 ఏళ్లక్రితం నరేష్ గోయల్ స్థాపించిన జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణను ఎస్‌బీఐ నాయకత్వంలోని బ్యాంకుల కాన్సార్టియం చేపట్టిన రెండోరోజే పైలెట్లు ఇలా వేతనాల కోసం నాగ్ ఇలా విజ్ఞప్తి చేయడం గమనార్హం. మార్చి 31లోపు అందాల్సిన సవరించిన రోడ్డు మ్యాప్ వివరాలు అందకపోవడంతోబాటు, వేతన బకారుూలు చెల్లించకపోవడం వల్ల ఏప్రిల్ 1 నుంచి సుమారు 1,100 మంది పైలెట్లు విమానాలు నడపడం మానేస్తున్నట్టు గత వారం జాతీయ వైమానికుల గిల్ట్ (నాగ్) ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో అనేక మల్లగుల్లాలు పడిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక చైర్మన్ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన సతీమణి అనిత బోర్డు నుంచి వైదొలగాలని సోమవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే వాటాలను కూడా 50.1 శాతం నుంచి 25.5 శాతానికి తగ్గించుకునేందుకు వారు అంగీకరించడం జరిగింది. అలాగే ఈ మార్పుల్లో భాగంగా సంస్థ విదేశీ భాగస్వామి ఎతిహాడ్ సైతం తన వాటాను 12 శాతానికి పెంచుకుని బోర్డులో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంది. ఈక్రమంలో బ్యాంకుల కన్సార్టి యం సుమారు 1,500 కోట్ల అత్యవసర ఆర్థిక సాయంగా ఈ విమానయాన సంస్థకు అందించనుంది. అంటే పూర్తి రుణం 9,700 కోట్ల ను సంస్థలో 50.1 శాతం ఈక్విటీలుగా మార్పుచేయడం జరుగుతుం ది. అలాగే ఇదివరకు 25 శాతం ఉన్న ప్రజల వాటాను సైతం 12.5 శాతానికి పరిమితం చేశారు. ఈ క్రమంలో తమతోబాటు, ఇంజనీర్లు చాలాకాలంగా వేతనాలు అందక అనుభవిస్తున్న బాధలు అర్థం చేసుకుని తదుపరి కూడా వేతనాలు ఆలస్యం చేయకుండా కొత్త యా జమాన్యం ఆదుకోవాలని ‘నాగ్’ ప్రధాన కార్యదర్శి తేజ్ సూద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్‌కు పంపిన ఈ మెయిల్‌లో విజ్ఞప్తి చేశారు. జెట్ ఎయిర్‌వేస్‌ను గాడిలో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జెట్ ఎయిర్‌వేస్‌కు సుమారు 1,600 మంది పైలె ట్లు ఉండగా అందులో అనేకులు ఇప్పటికే పోటీ విమానయాన సం స్థలు ఇండిగో, స్పైస్ జెట్‌లలో ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తోంది.
పెరిగిన జెట్ ఎయిర్‌వేస్ వాటాల విలువ
జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి వ్యవస్థాపక చైర్మన్ గోయల్, ఆయన సతీమణి అనిత తప్పుకోవడంతో మంగళవారం ఆ సంస్థ వాటాల విలువ గణనీయంగా పెరిగింది. స్టాక్‌మార్కెట్లలో ఈ కంపెనీ వాటాలు 6.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బీఎస్‌ఈలో ఈ సంస్థ వాటా ఒక్కొక్కటి 271 రూపాయల నుంచి 9.62 శాతం పెరిగి ఒక్కో వాటాధర 279 రూపాయలకు ఎగబాకింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 5.37 శాతం వృద్ధిని నమోదుచేసి 267.75 రూపాయలకు చేరింది. మొత్తం 54.11 లక్షల వాటాలు బీఎస్‌ఈలో, సుమారు 6 కోట్ల షేర్లు ఎన్‌ఎస్‌ఈలో ట్రేడయ్యాయి. సోమవారం సైతం ఈ సంస్థ వాటాలు 15.5 శాతం పేర పెరిగాయి.