బిజినెస్

‘క్విప్’ ద్వారా డీఎల్‌ఎఫ్ నిధుల సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: మార్కెట్ విలువలో దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ (డీఎల్‌ఎఫ్) లిమిటెడ్స్ తన వాటాలను దేశీయ సంస్థాగత మదుపరులకు విక్రయించడం ద్వారా 3,173 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) ఇస్యూ ద్వారా ఈ నిధుల సమీకరణ జరిగిందని శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది. ఈ నిధుల ద్వారా అప్పులను తిరిగి చెల్లించేందుకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొంది. 2018 డిసెంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 7,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. మదుపర్లకు 17.3 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు సంబంధించిన క్విప్ ఇస్యూను ఈ కంపెనీ విడుదల చేయగా దాని గడువు గురువారంతో ముగిసిపోయిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఒక్కో వాటా ఇస్యూ ధర 183.40 రూపాయలుగా నిర్ణయించారు. కాగా రెండు దఫాలుగా విడుదలైన డీఎల్‌ఎఫ్ క్విప్ ఇస్యూకు అపూర్వ స్పందన వచ్చి అనుకున్న దానికంటే అధికంగా కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. ఇందులో ప్రధానంగా ఒప్పెన్‌హైమర్, యూబీఎస్, హెచ్‌ఎస్‌బీసీ, మార్షల్ అండ్ వాస్, మైరియాడ్, కీ స్క్వార్, గోల్డ్‌మన్ సచ్స్, ఇండస్, ఈస్ట్‌బ్రిడ్జ్, టాటా మ్యూచువల్ ఫండ్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు ఈ ఇస్యూను సొంతం చేసుకున్నాయని డీఎల్‌ఎఫ్ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇలావుండగా డీఎల్‌ఎఫ్ ద్వారా ఇలా మూడోమారు నిధుల సమీకరణ జరిగింది. 2007లో తొలిసారి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐఓపీ) ద్వారా రూ.9,200 కోట్ల నిధుల సమీకణను ఆ సంస్థ చేపట్టింది.
అలాగే 2013లో ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా సుమారు రూ.1,900 కోట్ల నిధులు సమీకరించడం జరిగింది. ఇలావుండగా కంపెనీ శుక్రవారం 24.97 కోట్ల కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లు (సీసీడీ)లను ప్రమోటర్స్ ఎంటిటీలకు కేటాయించేందుకు శుక్రవారం సంస్థ ఆమోదం తెలిపింది. సమానమైన ఈక్విటీ వాటాలను రూ.217.25కు ఒక్కో షేరువంతున కేటాయిస్తారు. ఇలా వరుస నిధుల సమీకరణ ద్వారా కంపెనీ రుణ భారం తగ్గించుకునేందుకు వీలు కలుగుతోందని డీఎల్‌ఎఫ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశోక్ త్యాగి పేర్కొన్నారు.