బిజినెస్

చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేటు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)సహా అన్ని రకాల చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేటు యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో మొదలై, జూన్‌తో ముగిసే మొదటి త్రైమాసికానికి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయరాదని ప్రభుత్వం తీర్మానించింది. ప్రస్తుతం పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీల్లో వడ్డీ రేటు ఏడాదికి 8 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లో పెట్టుబడులపై 112 నెలలకు 7.7 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, చిన్న మొత్తాల పొదుపై చెల్లించే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవని, తదుపరి నిర్ణయాన్ని జూన్ మాసాంతంలోగా తీసుకుంటామని వివరించింది. సీనియర్ సిటిజెన్ల పొదుపుపై చెల్లిస్తున్న 8.7 శాతం వడ్డీని కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తామని పేర్కొంది.