బిజినెస్

బలపడిన మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణును ప్రదర్శించ డంతో, దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైన కూడా కనిపించింది. సెనె్సక్స్ లాభాల్లో ముగిసింది. నిఫ్టీ కూడా లాభాలను ఆర్జించింది. మొత్తం మీద ఈవారం మార్కెట్ లాభాల్లో ముగిసింది. శని, ఆది వారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. సోమవారం తిరిగి మొదలవుతుంది.

127 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్

ముంబయి, మార్చి 29: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలు శుక్రవారం మరింత పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్ బలపడడంతో, లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 127.19 పాయింట్లు పెరిగి, 38,672.91 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 53.90 పాయింట్లు బలపడి, 11,623.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఆటో, మెటల్ కంపెనీల స్టాక్స్ ఎక్కువ లాభాలను ఆర్జించాయి. విదేశీ పెట్టుబడులతోపాటు, అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా స్పందించడంతో, భారత స్టాక్ మార్కెట్ కూడా లాభాలను ఆర్జించింది. 38,545.72 పాయింట్ల వద్ద మొదలైన స్టాక్ మార్కెట్ మొదటి నుంచే లాభాల బాట పట్టింది. ఒకానొక దశలో 38,748.54 పాయింట్ల వరకూ చేరింది. కానీ, అదే స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి 0.33 శాతం పెరుగుదలతో 38,672.91 పాయింట్ల వద్ద ముగిసింది. వేదాంత స్టీల్ అన్నిటి కంటే ఎక్కువగా లాభపడింది. ఈ కంపెనీ షేర్లు 3.20 శాతం లాభాలను ఆర్జించాయి. లాభాలను సంపాదించిన కంపెనీల జాబితాలో టాటా స్టీల్ (2.73 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (2.27 శాతం), టాటా మోటార్స్ (2.17 శాతం), ఓఎన్‌జీసీ (1.66 శాతం) ఉన్నాయి. అదే విధంగా హెచ్‌యూఎల్ 1.40 వాతం, మారుతీ సుజికీ 1.31 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.18 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.04 శాతం. హీరో మోటోకార్ప్ 0.92 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, సానుకూల మార్కెట్ ట్రేడింగ్‌లోనూ ఇండస్‌ఇండ్ (2.08 శాతం), ఐటీసీ (1.10 శాతం), బజాజ్ ఆటో (0.89 శాతం), యాక్సిస్ బ్యాంక్ (0.79 శాతం), ఏషియన్ పెయింట్స్ (0.17 శాతం) నష్టాలను చవిచూశాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్ 5.81 శాతం, హెచ్‌పీఎల్‌సీ 4.18 శాతం, వేదాంత 3.59 శాతం, గ్రాసిమ్ 3.35 శాతం, యూపీఎల్ 3.21 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. కాగా, గెయిల్ (2.97 శాతం), ఇండస్‌ఇండ్ (2.26 శాతం), ఇచర్ (1.68 శాతం), బజాజ్ ఆటో (1.28 శాతం), భారతీ ఇన్‌ఫ్రా (1.17 శాతం) నష్టాలను చవిచూశాయి.
చైనాతో వాణిజ్య చర్చల కోసం అమెరికా బృందం బీజింగ్ వెళ్లిన నేపథ్యంలో, మార్కెట్‌లో సానుకూల ధోరణులు వ్యక్తమయ్యాయి. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే అవకాశం ఉందన్న వార్త స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. కాగా, ఇన్‌ట్రా డేలో డాలర్ విలువ 69.17 రూపాయలుగా ముగిసింది.