బిజినెస్

అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ వాటాల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) అనుబంధ సంస్థల్లో ఒకటైన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు చెందిన వాటాల్లో కొంత భాగాన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘జనరల్ అట్లాంటిక్ గ్రూప్’నకు అలాగే ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంస్థ ‘వార్దే పార్ట్‌నర్స్’కు విక్రయించేందుకు నిర్ణయం జరిగింది. తద్వారా సుమారు 1,851.8 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యం గా పెట్టుకున్నట్టు పీఎన్‌బీ శుక్రవారం నాడిక్కడ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలనీ ఈరోజే పూర్తయ్యాయని ఈప్రభుత్వ రంగ బ్యాంకు తెలిపింది. ఒప్పందం మేరకు మొత్తం 1,08,91,733 ఈక్విటీ షేర్లను పీఎన్‌బీ హౌసింగ్ పైనాన్స్ లిమిటెడ్స్ నుంచి జనరల్ అట్లాంటిక్ గ్రూప్ సంస్థకు ఒక్కో వాటా రూ.850 వంతు న విక్రయించడం జరుగుతుంది. తద్వారా రూ.925 కోట్లు సమీకరించాలని నిర్ణయం జరిగింది. అలాగే 1,08.91.733 ఈక్విటీ షేర్లను వర్దే పార్ట్‌నర్స్ సంస్థకు ఒక్కో వాటా రూ.850 వంతున విక్రయించి రూ.925 కోట్ల రూపాయలు సమీకరించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. కాగా పీఎన్‌బీ తన వ్యూహాత్మక భాగస్వామ్యంగా 19.78 శాతం వాటాలను మూలధనంలో కొనసాగిస్తూ ప్రమోటర్‌గా, వ్యూహాత్మక షేర్‌హోల్డర్‌గా వ్యవహరిస్తుందని సంబంధిత అధికారులు వివరించారు. రెగులేటరీ అప్రూవల్స్‌తోబాటు కస్టమరీ కండిషన్స్‌పై ఆధారపడి ఒప్పందానికి తుదిరూపం వస్తుందని తెలిపారు. కాగా 2018 డిసెంబర్ వరకు పీఎన్‌బీకి తన హౌ సింగ్ ఫైనాన్స్ విభాగంలో 32.79 శా తం వాటాలున్నాయి. ఈ వాటాధరలు ప్రస్తుతం 3.39 వృద్ధితో రూ.857.50 వంతున ట్రేడవుతున్నాయి.