బిజినెస్

విదేశీ రుణాల్లో తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: దేశ మార్కెట్‌లోకి వస్తున్న విదేశీ రుణాల్లో తగ్గుదల నమోదైంది. గత నెల 2.81 బిలియన్ డాలర్ల వరకు విదేశీ రుణాలు తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే కాలానికి వచ్చిన విదేశీ రుణాలతో పోలిస్తే, ఇది 9 శాతం తక్కువ. దేశీయ కంపెనీలు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ) గత ఏడాది ఫిబ్రవరిలో 3.1 బిలియన్ డాలర్ల మేర రుణాలు సేకరించాయి. అయితే, ఈ ఏడాది అదే కాలంలో కంపెనీలు ఏవీ వీటిపై అంతగా ఆధారపడలేదు. ఫలితంగా విదేశీ రుణ భారం భారీగా తగ్గింది. కాగా, ఎక్కువ మొత్తంలో విదేశీ రుణాలను తీసుకున్న కంపెనీల జాబితాలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ మొదటి స్థానంలో ఉంది. ఈ కంపెనీ 550 మిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడుల కోసం రుణాలను తీసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 400 మిలియన్ డాలర్లను ఉప రుణాలు ఇచ్చేందుకు విదేశాల నుంచి అప్పుగా తీసుకుంది. శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ 400 మిలియన్ డాలర్లు, మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ 300 మిలియన్ డాలర్లు, టాటా కేపిటల్ 200 మిలియన్ డాలర్లు, హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ 140.71 మిలియన్ డాలర్ల చొప్పున విదేశీ రుణాలు తీసుకున్నాయి.