బిజినెస్

రూ. 2 కోట్ల నిధులు సమీకరించిన ‘బాక్స్‌ఫ్రెష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సరఫరా అంకుర సంస్థ ‘బాక్స్‌ప్రెష్’ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారినుంచి సుమారు రూ.2కోట్ల నిధులు సమీకరించింది. సోమవారం ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్ధ పెట్టుబడిదారుల్లో ఇండిఫి టెక్నాలజీస్ సీఈవో, వ్యవస్ధాపకుడు అలోక్‌మిట్టల్, ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ ఇనె్వస్టర్ నితిన్ సింఘాల్, శిక్షా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు, సీఈవో మహేంద్ర ప్రతాప్ తదితరులు ఉన్నారు. ఈ నిధుల ద్వారా సంస్థ డెలివరీ సర్వీసును గురుగావ్, న్యూఢిల్లీల్లోని సుమారు 200 నివాస పరిసర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో మొత్తం ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించడం జరుగుతుందని బాక్స్‌ఫ్రెష్ వ్యవస్థాపకుడు, సీఈవో అశుతోష్ జోహ్రి తెలిపారు.