బిజినెస్

ఖాతాదారులకు ఆర్‌ఎన్‌ఏఎం నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రిలయన్స్ నిప్పో లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌ఎన్‌ఏఎం) తన ఖాతాదారులకు సరికొత్త నజరానాను అందిస్తున్నది. దేశంలోనే మొట్టమొదటిసారి వాయిస్ ఆధారిత లావాదేవీలను ప్రారంభిస్తున్నది. గూగుల్‌తో కుదిరిన ఒప్పందంతో ఈ అవకాశాన్ని ఆర్‌ఎన్‌ఏఎం కల్పిస్తున్నది. స్మార్ట్ ఫోన్ లేదా డిజిటల్ డివైస్‌లో మాట్లాడడం, వినడంతోపాటు వివిధ రకాలైన వాయిస్ కమాండ్స్ ద్వారా లావాదేవీలను నిర్వహించవ్చని ఆర్‌ఎన్‌ఏఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు వీలుగా, రిలయన్స్ సింప్లీ సేవ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. పెట్టుబడిదారులందరికీ గూగుల్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సదుపాయం లభిస్తుందని ఆర్‌ఎన్‌ఏఎం తన ప్రకటనలో వివరించింది. ఈ విధానం ద్వారా 50 నుంచి 55 శాతం వరకు కొత్త ఖాతాదారులు పెరుగుతారని అంచనా వేసింది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌కు అనుబంధంగా కొనసాగుతున్న ఆర్‌ఎన్‌ఏఎం తాజాగా గూగుల్‌తో కుదిరిన భాగస్వామ్య ఒప్పందంతో, సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టనుంది.