బిజినెస్

లాభాలతో మార్కెట్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 1: ఈవారం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 164.27 పాయింట్లు పెరగ్గా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 45.25 పాయింట్లు పెరిగింది. ఈ పెరుగుదలతో సెనె్సక్స్ 38,837.18 పాయింట్లకు, నిఫ్టీ 11,669.15 పాయింట్లకు చేరాయి. కాగా, అటు బీఎస్‌ఈలో, ఇటు ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్ అత్యధికంగా లాభపడడం విశేషం. బీఎస్‌ఈలో ఈ సంస్థకు చెందిన వాటాలు 7.37 శాతం లాభాలను ఆర్జించాయి. వే దాంత 2.86 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.73 శా తం, టాటా స్టీల్ 2.66 శాతం, మారుతీ సుజికీ 2.57 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. లాభాల్లో ట్రేడైన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (2.09 శాతం), ఎల్‌అండ్‌టీ (2.05 శా తం), హెచ్‌సీఎల్ టెక్ (1.96 శాతం), ఇన్ఫోసిస్ (1.80 శాతం), టీసీఎస్ (1.54 శాతం) కూడా ఉన్నా యి. అయితే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు అనూహ్యంగా 3.28 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. మ హీంద్ర అండ్ మహీంద్ర 2.80 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.59 శాతం, పవర్ గ్రిడ్ 2.55 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌తోపాటు హిందాల్‌కో (5.28 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (2.97 శాతం), విప్రో (2.69 శాతం), మారుతీ సుజికీ (2.51 శాతం) కూడా లాభాలను ఆర్జించాయి. కాగా, జీ ఎంటర్‌టైనె్మంట్ 3.28 శాతం, యూపీఎల్ 2.80 శాతం, ఇచర్ 2.59 శాతం, ఐఓసీ 2.55 శాతం, ఇండస్‌ఇండ్ 2.23 శాతం చొప్పున నష్టాలు చవిచూశాయి.
ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచే లాభాల్లో పరుగులు తీసిన సెనె్సక్స్ ఒకానొక సమయంలో అత్యధికంగా 39,115.57 పాయింట్లకు చేరింది. కానీ, అదే ఒరవడిని కొనసాగించలేకపోయింది. చివరిలో అమ్మకాల ఒత్తిడి పెరిగినందువల్ల 38,837.18 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, ఆటో, ఎనర్జీ, ఇఫ్రా రంగాలకు చెందిన షేర్లు లాభా ల్లో ట్రేడయ్యాయి. ఐటీ, టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్, టెలికాం రంగాలకు చెందిన వాటాలు కూ డా లాభా ల్లో అమ్ముడయ్యాయి. అంతర్జాతీయ సూచీలు సా నుకూల ధోరణను ప్రదర్శించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు, దేశీయ మదుపరుల సెం టిమెంట్ కూడా మార్కెట్ లావాదేవీలకు అనుకూలించింది. మొత్తం మీద ఈవారం స్టాక్ మార్కెట్ మొదటి రోజు లాభాలతో సుభారంభం చేసింది.