బిజినెస్

అంచనాలను మించిన జీఎస్‌టీ వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 1.03 లక్షల కోట్లు, మే మాసంలో 94,016 కోట్లు, జూన్‌లో 95,610 కోట్లు, జూలైలో 96,483 కోట్లు, ఆగస్టులో 93,960 కోట్లు, సెప్టెంబర్‌లో 94,442 కోట్లు, అక్టోబర్‌లో 1,00,710 కోట్లు, నవంబర్‌లో 97,637 కోట్లు, డిసెంబర్‌లో 94,725 కోట్ల రూపాయలు చొప్పున జీఎస్‌టీ ద్వారా ఆదాయం లభించింది. జనవరిలో 1.02 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో 97,247 కోట్ల రూపాయల మేరకు జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి. మార్చిలో, గతంలో ఎన్నడూ లేనంతగా 1,06,577 కోట్ల రూపాయలు జీఎస్‌టీ ద్వారా లభించాయి. కేంద్రం తీసుకుంటున్న సరళీకృత విధానాలు, వివిధ వస్తుసేవలపై వేరువేరుగా పన్ను వసూళ్లతోపాటు, కొన్నింటిని కొత్తగా దీని పరిధిలోకి తీసుకురావడం వల్లే జీఎస్‌టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. బడ్జెట్‌లో చూపిన అంచనాలను అధిగమించింది. ఇలావుండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ ద్వారా 13.71 లక్షల కోట్ల రూపాయలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంచనా వేశారు. వసూళ్లు లక్ష్యాలను మించే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించారు.
*
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: గత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అంచనాలను మిం చి నమోదయ్యాయి. ఒక్క మార్చి మాసంలోనే రికార్డు స్థాయిలో 1.06 లక్షల కోట్ల రూపాయలు జీఎస్‌టీ రూపంలో ఖజానాకు చేరాయి. 2017 జూలై మాసంలో అత్యధికంగా 75.05 లక్షల కోట్ల రూపాయలు వసూలుకా గా, ఆ రికార్డు మార్చిలో వసూళ్లు బద్ద లు చేసింది. జీఎస్‌టీ నిబంధనలను సరళీకృతం చేయడం, అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11.77 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూలైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. మార్చి మాసంలో 1,06,577 కోట్ల రూపాయలు వసూలు అవడానికి ఉత్పత్తి, వినియోగ రంగాల పరిధి విస్తృతం కావడమేనని వ్యాఖ్యానించా రు. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 98,114 కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూలైందని, అంతకు ముం దు సంవత్సరంతో పోలిస్తే ఇది 9.2 శాతం అధికమని జైట్లీ వివరించారు. ఇటీవల కాలంలో ఆదాయం పెరగడం ఆరంభమైందనడానికి ఇదే నిదర్శమని పేర్కొన్నారు. వివిధ రకాలైన వస్తుసేవలకు వేరువేరు టారిఫ్‌ను నిర్ణయిస్తూ, ప్రభుత్వం హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకుందని, దాని ఫలితంగానే జీఎస్‌టీ ద్వారా ఆదాయం పెరుగుతున్నదని జైట్లీ తెలిపారు. మార్చి మాసంలో మొత్తం 1,06,577 కోట్ల రూపాయలు వసూలయ్యాయని, ఇందులో కేంద్ర జీఎస్‌టీ 20,353 కోట్ల రూపాయలుకాగా, రాష్ట్రాల జీఎస్‌టీ 27,520 కోట్ల రూపాయలని తెలిపారు. సమీకృత జీఎస్‌టీ మొత్తం 50,418 కోట్ల రూపాయలని చెప్పారు. సెస్ మొత్తం 8,286 కోట్ల రూపాయలని, జీఎస్‌టీని అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇంత వరకూ ఎన్నడూ ఇంత భారీ ఎత్తున జీఎస్‌టీ వసూలు కాలేదని జైట్లీ తెలిపారు. 2019-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ లక్ష కోట్ల రూపాయలకు మించడం ఇది నాలుగోసారని గుర్తుచేశారు. 2018 మార్చితో పోలిస్తే, 2019 మార్చిలో వసూలైన జీఎస్‌టీ 15.6 శాతం ఎక్కువని పేర్కొన్నారు. అప్పట్లో 92,167 కోట్ల రూపాయలు వసూలైనట్టు ఆయన తెలిపారు. బడ్జెట్‌లో జీఎస్‌టీ ఆదాయాన్ని 11.47 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశామని, 11.77 లక్షల కోట్ల వసూళ్లతో ఆ అంచనాలను అధిగమించామని జైట్లీ వివరించారు.