బిజినెస్

అంతర్జాతీయ వాణిజ్యాభివృద్థికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, ఏప్రిల్ 2: అంతర్జాతీయ వాణిజాభివృద్ధి 2019లో మందగించే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రగతిలో తగ్గుదల నమోదయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంగళవారం అంచనా వేసింది. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, వాణిజ్యపమైన వత్తిడులు ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతాయని డబ్ల్యూటీవో విశే్లషించింది. ఈ సంవత్సరం 3.7 శాతం వాణిజ్యాభివృద్ధి జరిగే వీలుందని ప్రాథమిక అంచనాలను తొలుత డబ్ల్యుటీవో రూపొందించింది. అయితే మారిన పరిస్థితులను బేరీజువేసిన అనంతరం ఆ గణాంకాలను సవరించి వృద్థిని 2,6 శాతానికే పరిమితం చేసింది. అంటే 2018లో 3శాతం అదనంగా అదనంగా నమోదైన వాణిజ్యాభివృద్ధి ఈ సంవత్సరం తగ్గుతుందని నివేదిక స్పష్టం చేసింది. గత 12 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారికి ఈ విషయం తేటతెల్లం అవుతుందని డబ్ల్యూటీవో డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవేడో మంగళవారం జెనీవాలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. 164 మంది సభ్య దేశాల డబ్ల్యుటీవో ప్రధానంగా తన వార్షిక నివేదిక కోసం ప్రధానంగా ప్రపంచ ఆర్థిక రంగానికి ప్రమాదకరంగా మారిన అంశాలను పరిశీలించింది. ప్రత్యేకించి చైనా-అమెరికా పరస్పరం ధరల (టారిఫ్) ఎదురుదాడులకు పాల్పడటం ప్రపంచ వాణిజ్యాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డబ్ల్యుటీవో అంచనా వేసింది. ఈ ధరల యుద్ధానికి రెండు వాణిజ్య అగ్రరాజ్యాలూ పరస్పర చర్చల ద్వారా ముగింపు పలకాలని ఆ నివేదిక సూచించింది. అయితే ఈ సమస్య ఎప్పటికి సమసిపోతుందనే విషయంపై స్పష్టత లేని విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. ఈ ఆధిపత్యపోరులో ఏ దేశమైనా లాభపడిందా? అన్న ప్రశ్నకు అజెవేడో సమాధానమిస్తూ ఇరుదేశాలూ నష్టపోయాయన్నారు. ఈ టెన్షన్లకు తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రెగ్జిట్ కూడా రాబోయే రెండేళ్లపాటు ప్రపంచ వాణిజ్య రంగంపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూటీవో ఆర్థిక నిపుణుడు కాలెమన్ నీ అభిప్రాయపడ్డారు. కనీసం ఎలాంటి విత్‌డ్రాయల్ ఒప్పందాలూ లేకుండా బ్రిటన్ ఐరోపా దేశాలను గాలకొదిలేసిందని, ఇది విపరీత ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అయినా ఈ విషయంలో తుది ఫలితాలు వచ్చే వరకు వేచిచూడక తప్పదన్నారు.